REDMI K30 ఒక 5G స్మార్ట్ ఫోనుగా రానుంది

REDMI K30 ఒక 5G స్మార్ట్ ఫోనుగా రానుంది
HIGHLIGHTS

ఈ మొబైల్ ఫోనులో ఒక ప్రధాన మీడియా టెక్ ప్రాసెసర్‌ను తీసుకురానున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

ఇటీవలే, షావోమి గ్లోబల్ మేనేజర్ కొత్త రెడ్మి కె 30 స్మార్ట్‌ ఫోన్‌ తీసుకురావడనికి పనిచేస్తున్నట్లు ధృవీకరించింది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోనులో ఒక పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాను కూడా పొందబోతున్నారని మీడియా బ్రీఫింగ్‌లో కూడా వెల్లడైంది. అయితే, ఇప్పుడు ఈ మొబైల్ ఫోనులో ఒక ప్రధాన మీడియా టెక్ ప్రాసెసర్‌ను తీసుకురానున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

రెడ్మి కె 30 యొక్క లీక్ సమాచారం

వీబో మరియు ప్రైస్‌బాబా నుండి కొత్త వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం, ఆరోపిస్తున్న రెడ్మి కె 30 మొబైల్ ఫోనులో 5 జి కనెక్టివిటీని పొందబోతునట్లు అర్ధమవుతోంది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోనులో ఒక మీడియాటెక్ ప్రాసెసర్ కూడా లభిస్తుంది. రెడ్మినోట్ 8 ప్రో మొబైల్ ఫోనుకు సంబంధించి మీడియాటెక్‌తో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుందని మనకు తెలిసు, ఆ తర్వాత మేము హేలియో జి 90 టి గేమింగ్ చిప్‌ సెట్‌ను రెడ్మి ఫోనులో చూశాము. అయితే, ఇప్పుడు షావోమి తన భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోగలదని తెలుస్తోంది, దీని ఫలితంగా మనకు సరసమైన ధరలో 5G స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్లోకి తీసుకురాగలదని  అంచనాలు వేస్తున్నారు.

మీడియాటెక్ ఇప్పటికే 5G  చిప్‌ సెట్‌ మరియు  5 G మోడెమ్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ సెట్‌ ను కంపెనీకి రవాణా చేయడం ఈ ఏడాది చివరి నాటికి జరగాల్సి ఉంది. అంటే ఈ మీడియాటెక్ ప్రాసెసర్‌తో రానున్న రెడ్మి కె 30 ను వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయవచ్చు, అంటే స్మార్ట్‌ ఫోన్ మార్కెట్లో రావడానికి ఎక్కువ సమయం పట్టదన్న మాట.

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఏమి రావచ్చు?

కంపెనీ తన రెడ్మి కె 20 సిరీస్ ఫోన్‌ లను పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో లాంచ్ చేసినట్లు మనము చూశాము, ఇది కాకుండా, అదే తరహలో వస్తున్న కొత్త తరం ఫోన్లయిన , శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10 + మాదిరిగా రెడ్మి కె 30 లో డ్యూయల్ ఫ్రంట్ సెల్ఫీ లభిస్తుంది. ఇది కాకుండా, మీరు వెనుకవైపు 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ పొందవచ్చు, ఇది మాత్రమే కాదు, ఈ మొబైల్ ఫోన్‌ లో క్వాడ్-కెమెరా సెటప్‌ను కూడా పొందవచ్చు. అయితే, దీని గురించి ఇంకా అధికారికంగా ఏమీ వెల్లడించలేదు.

గమనిక: ఇమేజి చిత్రం ఫాంటసీ చిత్రం మాత్రమే !  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo