అతి త్వరలోనే NOKIA 1.3 తక్కువ ధ్రలో విలక్షణంగా విడుదలయ్యే అవకాశం

అతి త్వరలోనే NOKIA 1.3 తక్కువ ధ్రలో విలక్షణంగా విడుదలయ్యే అవకాశం
HIGHLIGHTS

ఈ కొత్త ఫోన్ బ్లూటూత్ సర్టిఫికేషన్ సైట్‌ లో కనిపించింది.

అతిత్వరలోనే, HMD గ్లోబల్ మరో సరసమైన స్మార్ట్‌ ఫోన్ను విడుదల చేయవచ్చు. మోడల్ నంబర్ TA-1213 తో నోకియా నుండి వచ్చిన ఈ కొత్త ఫోన్ బ్లూటూత్ సర్టిఫికేషన్ సైట్‌ లో కనిపించింది. ఈ ఫోన్ నోకియా 1.3 కావచ్చు.

నోకియా TA-1213 డివైజ్ బ్లూటూత్ జాబితాలో బ్లూటూత్ 4.2 మద్దతుతో గుర్తించబడింది మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 సిరీస్ ప్రాసెసర్‌ తో ఇది పనిచేస్తుంది, ఇది క్వాల్కమ్ 215 ప్రాసెసర్‌గా భావిస్తున్నారు. ఈ నోకియా 1.3 కి సంబంధించిన ఎక్కువ సమాచారం వెల్లడించలేదు కాని కంపెనీ త్వరలో దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని  మాత్రం తెలుస్తోంది.

అయితే, ఇటీవలే HMD గ్లోబల్ తన నోకియా 2.3 ఫోన్ను విడుదలచేసింది. ఈ ఫోన్ ఒక 6.2-అంగుళాల డిస్ప్లేతో 720 x 1520 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 19: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఇది 2GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ హెలియో A22 SoC చేత శక్తినిస్తుంది మరియు 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది. ఒక మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజిను 512GB వరకు పెంచవచ్చు. ఈ నోకియా 2.3 లో 3.5 mm హెడ్‌ ఫోన్ జాక్ ఉంది మరియు మైక్రో USB తో వస్తుంది. దీని బరువు 183 గ్రాములు ఉంటుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే, నోకియా 2.3 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ను ఒక ప్రధాన 13MP సెన్సార్‌తో f / 2.2 ఎపర్చర్‌తో మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో కలిపి వుంటుంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమేరా ఉంది. ఇందులో HMD గ్లోబల్ సిఫార్సు చేసిన షాట్ ఫీచర్ గురించి ప్రత్యేకంగా చెబుతోంది.ఇది షట్టర్ ప్రెస్‌ కు ముందు మరియు తరువాత 15 చిత్రాలను తీసుకుంటుంది మరియు తరువాత ఉత్తమ షాట్‌ ను ఎంచుకుంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై OS పైన నడుస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 కి అప్‌ గ్రేడ్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo