Nubia N3 వంటి స్పెక్స్ తోనే Nubia V18 స్మార్ట్ ఫోన్ లాంచ్…

Nubia N3 వంటి స్పెక్స్ తోనే  Nubia V18 స్మార్ట్ ఫోన్ లాంచ్…

ZTE యొక్క సబ్  బ్రాండ్ నుబియా తన  కొత్త  మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ నుబియా V18 ను చైనాలో ప్రారంభించింది. దీని  ధర 1,299 యువాన్ (సుమారు రూ. 13,370) మరియు 29 మార్చి నుండి ఈ ఫోన్ చీమ్  నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. V18 స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్ లు Nubia N3 తో సరిపోలుతున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nubia V18 స్మార్ట్ఫోన్ ఒక 6.01 అంగుళాల పూర్తి HD + డిస్ప్లే తో వస్తుంది, దీని రిజల్యూషన్  2,160 × 1,080 పిక్సల్స్, మరియు ఈ డివైస్ లో 18: 9 యాస్పెక్ట్ రేషియో వుంది . డిస్ప్లే టాప్ నుండి 2.5D కర్వ్డ్ గ్లాస్ తో కప్పబడి ఉంటుంది. ఈ డివైస్  స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ మరియు అడ్రినో 506 GPU కలిగి ఉంది. అదనంగా, ఈ పరికరం 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ను కలిగి ఉంది, ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు పెంచబడుతుంది.

నోబియా V18 స్మార్ట్ఫోన్ ని నుబియా  UI 5.1 తో Android 7.1 నౌగాట్ తో   ప్రారంభించారు. ఆప్టిక్స్ గురించి మాట్లాడుతూ, 13 మెగాపిక్సెల్ వెనుక ఉన్న LED కెమెరా, LED ఫ్లాష్ మరియు PDAF తో కూడిన ప్రాధమిక కెమెరాతో వస్తుంది. ఈ డివైస్  ముందు 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది, ఇది బ్యూటీ ఫై  మోడ్ మరియు ఫేస్ అన్లాక్ సపోర్ట్ తో వస్తుంది. 

ఈ డివైస్  4,000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది నియోపవర్ 3.0 టెక్నాలజీ మరియు USB OTG సపోర్ట్ తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ 4.1 LE మరియు GPS + GLONASS మరియు  మరియు 170 గ్రాముల బరువు ఉంటుంది. ఫిజికల్  హోమ్ బటన్ పరికరంలో ఇవ్వలేదు, మరియు ఈ స్మార్ట్ఫోన్ మూడు నలుపు, ఎరుపు మరియు గోల్డ్ కలర్స్ లో లభిస్తుంది.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo