32GB స్టోరేజ్, 3GB ర్యామ్ కలిగిన లెనోవో vibe S1 ప్రైస్ ఇప్పుడు 3000 రూ తగ్గింపు ధరతో వస్తుంది

లెనోవో ఇండియాలో Vibe S1 మోడల్ ను 2015 నవంబర్ లో 15,999 రూ లకు లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెని రెడ్మి నోట్ 3 కు పోటీగా VibeS1 ప్రైస్ ను తగ్గించింది.
ఈ రోజు నుండి Vibe S1 12,999 రూ లకు సెల్ కానుంది. ఈ ఫోన్ స్పెషల్ ఏంటంటే డ్యూయల్ ఫ్రంట్ కేమేరాస్. కాని హై బ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది ఫోన్.
ఎప్పుడు ఒకే బోరింగ్ డిజైన్ తో ఉండే లెనోవో లో ఈ ఫోన్ తోనే కొత్త ప్రీమియం డిజైనింగ్ స్టార్ట్ అయ్యింది. లుక్స్ బాగుంటాయి. మిగిలిన స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో...
- 5 in FHD డిస్ప్లే.
- డ్యూయల్ sim
- 8MP అండ్ 2MP - ఫ్రంట్ కేమేరాస్ (8MP షార్ప్ ఫోటోస్ కొరకు 2MP depth మరియు డిటేల్స్ కొరకు)
- 13MP రేర్ కెమెరా
- 1.7GHz 64 బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ MT6752 ప్రొసెసర్
- 3GB ర్యామ్
- 32GB ఇంబిల్ట్ అండ్ 128GB sd కార్డ్ సపోర్ట్ - హై బ్రిడ్ స్లాట్
- ఆండ్రాయిడ్ లాలిపాప్ os
- 4G ఇంటర్నెట్ కనెక్టివిటి
- 2500 mah బ్యాటరీ
ఈ ఫోన్ ను మేము రివ్యూ చేయటం జరిగింది. కంప్లీట్ తెలుగు రివ్యూ కొరకు ఈ లింక్ లోకి వెళ్ళగలరు..
