Lenovo S5 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ అండ్ 18:9 యాస్పెక్ట్ రేషియో తో లాంచ్….

Lenovo S5 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ అండ్  18:9 యాస్పెక్ట్ రేషియో తో లాంచ్….

లెనోవా చైనాలో తన  లెనోవా S5 స్మార్ట్ఫోన్ ని  ప్రారంభించింది, ఈ స్మార్ట్ఫోన్ 18: 9  యాస్పెక్ట్ రేషియో డిస్ప్లే తో పరిచయం చేయబడింది. మీరు దాని ఇతర ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే, స్మార్ట్ఫోన్ పూర్తిస్థాయి మెటల్ బాడీ ని , 2.5D కర్వ్డ్ స్క్రీన్ తో మార్కెట్లోకి తీ వచ్చింది . దీనితో పాటు, మీరు స్మార్ట్ఫోన్లో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా పొందుతారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీరు లెనోవా S5 స్మార్ట్ఫోన్ ధర గురించి చర్చించినట్లయితే, దీని  ధర CNY 999 వద్ద మొదలవుతుంది , ఇది దాదాపు రూ. 10,300 లో ఉంటుంది . ఈ స్మార్ట్ఫోన్ యొక్క 3GB RAM మరియు 32GB స్టోరేజ్  వేరియంట్. ధర CNY 1,199 అంటే సుమారు రూ. 12,400 ఉంది. ప్లస్, మరో మోడల్ ధర 4GB RAM మరియు 128GB స్టోరేజ్  వేరియంట్ CNY 1,499 అనగా సుమారు రూ. 15.400 ఉంది.

ఈ అన్ని మోడళ్లను కంపెనీ  యొక్క అధికారిక వెబ్సైట్ కి  వెళ్లడం ద్వారా నమోదు చేసుకోవచ్చు, ఇది కాకుండా మార్చి 23 న అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. 

5.7-అంగుళాల FHD + IPS డిస్ప్లే 1080×2160 పిక్సెల్స్ తో   అందుబాటులో ఉంది. దీనితో పాటు, ఆక్టా-కోర్ స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ కూడా ఉంది, దీని క్లోక్ స్పీడ్  2GHz. 

ఫోన్ లో  ఒక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 13-మెగాపిక్సెల్ రెండు సెన్సార్ కాంబో. దీనితో పాటు, 16 మెగాపిక్సెల్ ఫిక్సడ్ ఫ్రంట్ ఫ్రంట్ కెమెరా కూడా ఈ స్మార్ట్ఫోన్లో అందించబడుతుంది. ఫోన్లో ఒక 3000 mAh  బ్యాటరీ అందించబడుతుంది. 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo