Lava Virat V1 లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ అయ్యాయి.. ఫోన్ ఎలా ఉందంటే.!

HIGHLIGHTS

Lava Virat V1 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ రిలీజ్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ మరియు వీడియో విడుదల చేసింది

లావా మొదటిసారి ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో లాంచ్ చేస్తోంది

Lava Virat V1 లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ రివీల్ అయ్యాయి.. ఫోన్ ఎలా ఉందంటే.!

Lava Virat V1 స్మార్ట్ ఫోన్ కోసం గత కొంత కాలంగా టీజింగ్ చేస్తూ వస్తున్న లావా, ఈరోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు కేవలం పేరుతో మాత్రమే టీజింగ్ చేసినా లావా, ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ మరియు వీడియో విడుదల చేసింది. ఇప్పటి వరకు కేవలం అమెజాన్ భాగస్వామ్యంతో మాత్రమే ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన లావా మొదటిసారి ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యంతో లాంచ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Virat V1 : లాంచ్ డేటా

లావా విరాట్ 1 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను 24 జూలై 2026 గా లావా అనౌన్స్ చేసింది. ఆ రోజు లావా ఈ ఫోన్ ను మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కెట్లో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ యూనిక్ ఫోన్ గా లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Lava Virat V1 : కీలక ఫీచర్స్

లావా విరాట్ 1 స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కొన్ని ఇతర వివరాలు వెల్లడించేలా కొత్త టీజర్ ను లావా రిలీజ్ చేసింది. ఈ టీజర్ ప్రకారం, ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు లో డ్యూయల్ రియర్ కెమెరాతో లాంచ్ అవుతున్నట్లు క్లియర్ అయ్యింది. ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి.

Lava Virat V1 launch date

ఈ ఫోజి టీజర్ వీడియో ప్రకారం ఈ ఫోన్ లో వెనుక లేజర్ కట్ డిజైన్ బ్యాక్ ప్యానల్ ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన డిజైన్ తో ఈ ఫోన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ లావా ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. అంతేకాదు, ఈ కెమెరా పక్కన చిన్న స్క్రీన్ ఉన్నట్లు కూడా అనిపిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్స్ ను ఇంకా అఫీషియల్ గా వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ లీక్స్ మరియు అంచానా ఫీచర్స్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది.

Also Read: Goboult Tenet Pro: చవక ధరలో ANC TWS బడ్స్ లాంచ్ చేసిన గోబోల్ట్.!

అంచనా మరియు లీక్డ్ ఫీచర్స్

లీక్స్ ప్రకారం, ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బిగ్ AMOLED డిస్‌ప్లే తో లాంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ Dimensity 7100 (6nm) చిప్‌ సెట్ అందించే అవకాశం ఉంది. ఇది కాకుండా 4K వరకు రికార్డ్ చేసే సపోర్ట్ 50MP AI డ్యూయల్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది. లీక్స్ ప్రకారం, ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

తర్వలోనే లావా ఈ ఫోన్ కీలక ఫీచర్స్ విడుదల చేస్తుంది కాబట్టి, ఈ ఫోన్ పైన నడుస్తున్న లీక్స్ లో ఎన్ని ఫీచర్స్ నిజం అవుతాయో తెలిసే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile