Goboult Tenet Pro: చవక ధరలో ANC TWS బడ్స్ లాంచ్ చేసిన గోబోల్ట్.!

HIGHLIGHTS

Goboult Tenet Pro కొత్త ఇయర్ బడ్స్ ను మార్కెట్లో లాంచ్ చేసింది

సరికొత్త పారదర్శక డిజైన్ మరియు ANC వంటి మరిన్ని ఫీచర్స్ తో లంచ్ చేసింది

గోబోల్ట్ టెనెట్ ప్రో ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,499 ధరలో రిలీజ్ చేసింది

Goboult Tenet Pro: చవక ధరలో ANC TWS బడ్స్ లాంచ్ చేసిన గోబోల్ట్.!

Goboult Tenet Pro: గోబోల్ట్ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను సరికొత్త పారదర్శక డిజైన్ మరియు ANC వంటి మరిన్ని ఫీచర్స్ తో లంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను ప్రస్తుతం రూ. 1,500 రూపాయల ప్రైస్ లో మార్కెట్ లో నడుస్తున్న ఇయర్ బడ్స్ కి గట్టి పోటీగా లాంచ్ చేసినట్లు గోబోల్ట్ తెలిపింది. ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Goboult Tenet Pro: ప్రైస్

గోబోల్ట్ టెనెట్ ప్రో ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,499 ధరలో రిలీజ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఈరోజు నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్స్ ను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ చేస్తోంది. ఈ ఇయర్ బడ్స్ క్రిమ్సన్ రెడ్, ఫ్రాస్ట్ వైట్ మరియు ఆలివ్ గ్రీన్ మూడు రంగుల్లో లంచ్ అయ్యింది.

Goboult Tenet Pro: ఫీచర్స్

గోబోల్ట్ టెనెట్ ప్రో ఇయర్ బడ్స్ ను చాలా ఆకర్షణీయమైన పారదర్శక డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ పెద్ద 13mm డైనమిక్ స్పీకర్స్ తో అందించింది. ఈ స్పీకర్లు శక్తివంతమైన బాస్, క్లియర్ వోకల్స్ మరియు బ్యాలెన్స్‌డ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. అంతేకాదు, ఈ బడ్స్ లో 32dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ ఉంది కాబట్టి, అనవసర శబ్దాలు నిరోధోస్తుంది. అంటే, చాలా క్లీన్ అండ్ క్లియర్ సౌండ్ మీకు లభిస్తుంది. ఇది AAC అండ్ SBC ఆడియో కోడెడ్ సపోర్ట్ తో వస్తుంది.

Goboult Tenet Pro ANC buds

ఇక కాలింగ్ విషయానికి వస్తే, ఈ ఇయర్ బడ్స్ Quad Mic ENC సెటప్ తో వస్తుంది. అంటే, కాల్స్ సమయంలో స్పష్టమైన వాయిస్ కోసం 4 మైక్ ఎన్విరాన్మెంటల్ నోయిస్ క్యాన్సిలేషన్ (ENC) టెక్నాలజీ ఉంది. ఈ ఫీచర్ పరిసర శబ్దాన్ని తగ్గించి మీ వాయిస్‌ ను అవతలి వ్యక్తికి క్లియర్‌గా చేరేలా చేస్తుంది. ఈ ఇయర్‌ బడ్స్ ఛార్జింగ్ కేస్‌ తో కలిపి టోటల్ 75 గంటల వరకు ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది. అయితే, ANC ఆన్ చేసినప్పుడు ఈ బ్యాటరీ బ్యాకప్ లో మార్పు ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ పరంగా, ఈ కొత్త బడ్స్ లో డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ సపోర్ట్‌ మరియు Bluetooth 6.0 సపోర్ట్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే, గేమింగ్ కోసం 45 ms లో లెటెన్సీ మోడ్ ను కూడా గేమింగ్ కోసం అందించింది. IPX5 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటంతో చెమట మరియు తేలికపాటి నీటి చినుకులు నుంచి రక్షణ లభిస్తుంది.

Also Read: EPFO Interest Credit: అకౌంట్లలో వడ్డీ జమ చేస్తున్న కేంద్రం .. ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలంటే.!

ఈ బడ్స్ లో గూగుల్ అసిస్టెంట్ లేదా Siri వంటి AI వాయిస్ అసిస్టెంట్ లకు సపోర్ట్ ఉంది. బడ్స్ టచ్ చేయడం ద్వారా వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయవచ్చు. GoBoult AMP యాప్ ద్వారా Custom EQ, ప్రీసెట్ సౌండ్ మోడ్‌, టచ్ కంట్రోల్స్ వంటి సెట్టింగ్‌లను మార్చుకునే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile