Lava Upcoming Mobile: సరికొత్త డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న లావా.!

HIGHLIGHTS

మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు లావా ప్రకటించింది

Lava Upcoming Mobile ను సరికొత్త డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్

ఈ అప్ కమింగ్ మొబైల్ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ కూడా మొదలు పెట్టింది

Lava Upcoming Mobile: సరికొత్త డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న లావా.!

Lava Upcoming Mobile: మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు లావా ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే LED లైట్ సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ మొబైల్ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ అధికారిక x అకౌంట్ నుంచి అనౌన్స్ చేసింది మరియు టీజింగ్ కూడా మొదలు పెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Upcoming Mobile

లావా త్వరలో కొత్త ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ ను ‘Coming Soon’ ట్యాగ్ తో టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ డిజైన్ తో టీజింగ్ కూడా చేస్తోంది.

Lava Upcoming Mobile : డిజైన్ మరియు ఫీచర్స్

లవ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పేరును కంపెనీ ‘ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ వీడియో తో టీజింగ్ ను మాత్రం మొదలు పెట్టింది. లావా అందించిన టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ సరికొత్త మరియు అందమైన డిజైన్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక కెమెరా చుట్టూ సన్నని లైన్ వంటి అందమైన LED లైట్ సెటప్ వుంది.

Lava Upcoming Mobile

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా మరియు పెద్ద LED లైట్ సెటప్ కూడా కనిపిస్తుంది. ఇందులో పెద్ద కెమెరా బంప్ వుంది మరియు ఇది ఫోన్ ను మరింత అందంగా కనిపించేలా చేస్తోంది. ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది.

Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తున్న 750W Dolby Soundbar.!

ఈ ఫోన్ లో ముందు సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు చాలా స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ త్వరలోనే లావా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile