Realme P4R 5G: మరో కొత్త 5జి ఫోన్ లాంచ్ కోసం సిద్ధమైన రియల్‌మీ.!
రియల్‌మీ తన కొత్త రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి అనౌన్స్ చేసింది
ఇప్పటికే Flipkart మరియు Realme అధికారిక వెబ్ సైట్ లో ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం టీజర్ పేజీలు లైవ్ చేసింది
ఈ ఫోన్ కీలక ఫీచర్లు మరియు ప్రైస్ వివరాలు సైతం కంపెనీ రివీల్ చేసింది
Realme P4R 5G: ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను శరవేగంగా వేగంగా విస్తరిస్తున్న రియల్‌మీ, తన కొత్త రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ మార్కెట్లో త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే Flipkart మరియు Realme అధికారిక వెబ్ సైట్ లో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజర్ పేజీలు లైవ్ చేసింది.
SurveyRealme P4R 5G: లాంచ్ డేట్ ఏమిటి?
రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు టైం ను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెల చివరి నాటికి ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ కోసం కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు మరియు ప్రైస్ వివరాలు సైతం కంపెనీ రివీల్ చేసింది.
Realme P4R 5G: కీలక ఫీచర్స్
రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో డ్యూయల్ చిప్ సెట్ పవర్ ఫో లాంచ్ చేయబోతున్నట్లు రియల్‌మీ టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో అందించే డ్యూయల్ చిప్ సెట్ వివరాలు కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ ను MediaTek Dimensity 7400 ప్రాసెసర్‌తో పాటు ప్రత్యేకమైన Hyper Vision+ AI చిప్ తో అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ డ్యూయల్ చిప్ సెటప్ గేమింగ్, వీడియో ప్రాసెసింగ్ మరియు AI ఆధారిత గ్రాఫిక్స్ పెర్ఫార్మన్స్ ను మరింత మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా, హై ఫ్రేమ్ రేట్ గేమింగ్, AI విజువల్ అప్ స్కేలింగ్ మరియు స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ టెక్నాలజీ మరింతగా ఉపయోగపడనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ మరిన్ని వివరాలై కంపెనీ రివీల్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ గురించి కొన్ని స్పెక్స్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. లీకైన వివరాల ప్రకారం, ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ తో కూడిన AMOLED డిస్‌ప్లే కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే, భారీ 7000mAh బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP AI కెమెరా సెటప్ మరియు Android 16 ఆధారిత సాఫ్ట్ వేర్ ను అందించవచ్చని లీకైన సమాచారం చెబుతోంది.
Also Read: ఫ్లిప్ కార్ట్ GRWM GRWM సేల్ భారీ ఆఫర్స్ తో 30 వేల లోపు బెస్ట్ Split AC అందుకోండి.!
రియల్‌మీ P4R 5జి : ప్రైస్
రియల్‌మీ P4R స్మార్ట్ ఫోన్ ను 30 వేల రూపాయల బడ్జెట్ ఫోన్ గా లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. అయితే, కచ్చితమైన ప్రైస్ వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
