ప్రముఖ ఇండియన్ మొబైల్ తయారీ సంస్థ LAVA ఇండియాలో 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అయితే, ఈరోజు ఆన్లైన్ లో లావా యొక్క ఒక అప్ కమింగ్ ఫోన్ కనిపించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ చాలా ఆకట్టుకునే డిజైన్ మరియు ఫీచర్లతో కనిపిస్తోంది. ఈ ఫోన్ మీడియా టెక్ 5G చిప్ సెట్ మరియు ట్రిపుల్ కెమెరాతో కనిపించింది.
Survey
✅ Thank you for completing the survey!
ఈ అప్ కమింగ్ లావా ఫోన్ LAVA AGNI 5G పేరుతో వస్తుందని మరియు ఈ ఫోన్ ధర రూ.19,999 ప్రైస్ ట్యాగ్ తో అందించవచ్చని టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకటించారు. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ యొక్క స్పెక్స్ షీట్ ను కూడా షేర్ చేసారు. Lava యొక్క YouTube ఛానెల్ నవంబర్ 9 లైవ్ షెడ్యూల్‌ను ప్రచురించింది. అంటే, ఈ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది.
LAVA AGNI 5G స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ డిజైన్, పంచ్ హోల్ డిజైన్ మరియు 90Hz డిస్ప్లే తో వస్తుంది. ఈ అప్ కమింగ్ 5G ఫోన్ 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియా టెక్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ Dimensity 810SoC తో పనిచేస్తుందని కూడా చెబుతున్నారు.
5,000 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు LAVA కస్టమ్ స్క్రీన్ వంటి మరిన్ని ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా పనిచేస్తుంది.