Lava Blaze 2 5G: తక్కువ ధరలో New 5G Phone లాంచ్ చేసిన లావా.!

HIGHLIGHTS

లావా ఈరోజు అతి తక్కువ ధరలో New 5G Phone ను లాంచ్ చేసింది

చవక ధరకే ట్రెండీ ఫీచర్లతో Lava Blaze 2 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది

ట్రెండీ ఫీచర్లతో కేవలం 10 వేల ధరలో తీసుకు రావడం విశేషం

Lava Blaze 2 5G: తక్కువ ధరలో New 5G Phone లాంచ్ చేసిన లావా.!

భారతీయ మొబైల్ కంపెనీ లావా ఈరోజు అతి తక్కువ ధరలో New 5G Phone ను లాంచ్ చేసింది. ఇప్పటికే అతి తక్కువ ధరలో గొప్ప 5G ఫోన్లను అందించిన ఈ ఇండియన్ బ్రాండ్ ఇప్పుడు మరింత చవక ధరకే ట్రెండీ ఫీచర్లతో Lava Blaze 2 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. లావా ఈ కొత్త 5 స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న ట్రెండీ ఫీచర్లతో కేవలం 10 వేల ధరలో తీసుకు రావడం విశేషం. ఈ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

lava New 5G Phone Lava Blaze 2 5G Price

లావా బ్లేజ్ 2 5జి స్మార్ట్ ఫోన్ ను లావా కేవలం రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరలో లాంచ్ చేసింది. ఈ ఇది స్టార్టింగ్ వేరియంట్ (4GB + 64GB) వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ. 10,999. నవంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.

ఈ ఫోన్ Amazon.in, lavamobiles.com మరియు అని ప్రధాన రిటైల్ స్టోర్స్ నుండి ఈ ఫోన్ లభిస్తుంది.

లావా బ్లేజ్ 2 5జి ప్రత్యేతలు

లావా బ్లేజ్ 2 5జి స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ HD+ IPS డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ లావా ఫోన్ MediaTek Dimensity 6020 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. దీనికి జతగా 4GB/6GB RAM మరియు 64GB/128GB (UFS 2.2) ఇంటర్నెల స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్ మరియు గ్లాస్ లావెండర్ అనే మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

New 5G Phone Lava Blaze 2 5G Features
లావా బ్లేజ్ 2 5జి ప్రత్యేతలు

ఈ లావా బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ కెమేరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. Slow Motion, Timelapse, UHD మరియు Night మోడ్ వంటి చాలా కెమేరా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.

Also Read : హెవీ సౌండ్ అందించే Party Speakers పైన Amazon Sale బిగ్ Offer.!

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile