Lava Bold N2 5G specs and features know a head of launch
Lava Bold N2 5G: లావా బడ్జెట్ సిరీస్ నుంచి లాంచ్ చేయబోతున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ బోల్డ్ ఎన్ 2 5జి రేపు భారత్ లో లాంచ్ అవుతుంది. బడ్జెట్ ధరలో Android 16 తో వచ్చే బడ్జెట్ 5G ఫోన్ ఇదే అని లీక్స్ రూమర్స్ ఇప్పటికే ఈ ఫోన్ గురించి కొనియాడుతున్నాయి. బడ్జెట్ యూజర్ ని టార్గెట్ చేస్తూ లావా విడుదల చేయబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే స్పెక్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా (Lava) తన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ N2 5G ను జూన్ 3న అంటే, రేపు అధికారికంగా విడుదల చేయనుంది. ఈ ఫోన్ ను బోల్డ్ N2 సిరీస్ లో నాలుగో మోడల్ గా రిలీజ్ చేస్తున్న ఫోన్ మరియు ఇది 5G కనెక్టివిటీ తో పాటు క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించనుంది.
లావా ఈ ఫోన్ ను “The No Nonsense Phone” అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం చేస్తోంది. అంటే, అనవసరమైన బ్లోట్ వేర్ లేకుండా, సింపుల్ అండ్ ఫాస్ట్ యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించడం ఈ ఫోన్ లక్షణం అని లావా చెబుతోంది. ముఖ్యంగా, ఈ స్మార్ట్ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ అయ్యే ప్రైస్ సెగ్మెంట్ లో Android 16 తో వచ్చే తొలి ఫోన్లలో ఇది కూడా ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
డిజైన్ పరంగా చూస్తే, ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో పాటు వెనుక స్క్వేర్ ఆకార కెమెరా మాడ్యూల్ కలిగి ఉంటుంది. ఇందులో 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు LED ఫ్లాష్ కూడా ఉంటుంది. అయితే, ఈ ఫోన్ గురించి ఎక్కువగా లావా వివరాలు బయట పెట్టలేదు. కానీ, ఈ ఫోన్ గురించి ఆన్లైన్ లో అనేక లీక్స్ ఈ ఫోన్ పూర్తి వివరాలు వెల్లడించాయి.
లీక్‌ల ప్రకారం, ఈ ఫోన్ లో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా. ఈ ఫోన్ ను 5000 mAh లేదా అంతకంటే పెద్ద బ్యాటరీతో అందించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను లేటెస్ట్ Unisoc 5G చిప్ సెట్ జతగా 4GB RAM మరియు 64GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ తో లాంచ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Realme P4R 5G: మరో కొత్త 5జి ఫోన్ లాంచ్ కోసం సిద్ధమైన రియల్‌మీ.!
ఇక ధర విషయానికి వస్తే, లావా బోల్డ్ N2 5G స్మార్ట్ ఫోన్ రూ.10,000 నుంచి రూ.13,000 మధ్య ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది కాబట్టి రేపు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం.