Lava Bold 2 5G : ఫస్ట్ సేల్ ఆఫర్స్ తో స్టార్ట్ అవుతోంది.!

HIGHLIGHTS

లావా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ చాలా సరసమైన ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ కేవలం 7.55mm మందంతో అల్ట్రా స్లిమ్ డిజైన్ తో ఉంటుంది

Lava Bold 2 5G: లావా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా సరసమైన ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది మరియు మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది చాలా చవక ధరలో మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే, ఇది లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ధరలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Lava Bold 2 5G : ధర

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ ను రూ. 12,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ తో ఉంటుంది. ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ప్రైస్ లో లభిస్తుంది. ఈ ఫోన్ మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అవుతుంది. ఈ లావా న్యూ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ అవుతుంది. ఫెదర్ వైట్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ రెండు కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Also Read: Ugadi 2026: తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మరియు ఇమేజస్ ప్రత్యేకంగా మీకోసం.!

Lava Bold 2 5G : ఫీచర్స్

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ కేవలం 7.55mm మందంతో అల్ట్రా స్లిమ్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ 5 లక్షల ప్లస్ AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ Dimensity 7060 చిప్ సెట్ తో నడుస్తుంది. ఇందులో 6 జీబీ LPDDR5 ఫిజికల్ ర్యామ్ జతగా 6 జీబీ వర్చువల్ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కాలంగా ఉంటుంది. ఈ లేటెస్ట్ లావా ఫోన్ బ్లోట్ వేర్ లేకుండా ఉంటుంది.

లావా బోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Ai డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ లావా ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు టైప్ C పోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా IP64 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :