Lava Blaze X: కర్వుడ్ డిస్ప్లే మరియు డ్యూయల్ కెమెరాతో వస్తుంది.!
లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ టీజర్ వీడియో ద్వారా డిజైన్ మరియు కలర్ వివరాలు అందించింది
Lava Blaze X కర్వుడ్ డిస్ప్లే తో వస్తుంది
Lava Blaze X: ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించని కంపెనీ ఈ ఫోన్ టీజర్ వీడియో ద్వారా డిజైన్ మరియు కలర్ వివరాలు అందించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను కర్వుడ్ డిస్ప్లే మరియు డ్యూయల్ కెమెరాతో తీసుకు వస్తున్నట్లు లేటెస్ట్ టీజర్ వీడియో నిర్ధారిస్తుంది.
SurveyLava Blaze X :
లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో విడుదల చేస్తుంది లావా. ఈ ఫోన్ ను బ్లేజ్ సిరీస్ నుండి తీసుకు వస్తోంది మరియు ఈ ఫోన్ ను కర్వుడ్ డిస్ప్లేతో అందిస్తుంది. ఈ ఫోన్ టీజింగ్ లో భాగంగా లావా అధికారిక X అకౌంట్ నుండి రిలీజ్ చేసిన కొత్త వీడియోలో కొన్ని వివరాలు వెల్లడించింది. అందులో, ఈ ఫోన్ కలర్ వేరియంట్, కెమెరా సెటప్ మరియు డిస్ప్లే వివరాలు కనిపిస్తాయి.

లావా ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు కలర్ వేరియంట్లలో లాంచ్ చేస్తుంది. ఇందులో, వైట్ మరియు బ్లూ కలర్ లు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ లో వెనుక పెద్ద రౌండ్ బంప్ కెమెరా డిజైన్ వుంది. లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఈ పెద్ద బంప్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇదే విషయాన్ని ఈ వీడియో లో లావా కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ మరియు ఆకర్షణీయమైన క్లాసి లుక్ లో కనిపిస్తుంది.
The only ‘X’ we can approve of 😉
— Lava Mobiles (@LavaMobile) July 1, 2024
Stay tuned to Xperience the Xraze!#BlazeX – Coming Soon#LavaMobiles #ProudlyIndian pic.twitter.com/okQm2zDKlT
ఇక మరిన్ని ఇతర వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో టైప్ C ఛార్జ్ పోర్ట్ వుంది మరియు పక్కనే పెద్ద స్పీకర్ గ్రిల్ కూడా వుంది. లావా బ్లేజ్ అనేది బడ్జెట్ సిరీస్ కాబట్టి ఈ ఫోన్ ను కూడా బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేసుకుని తీసుకుని వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో బడ్జెట్ ధరలో లభిస్తున్న కర్వుడ్ డిస్ప్లే 5జి స్మార్ట్ ఫోన్ కూడా లావా బ్రాండ్ నుండే వచ్చింది. లావా అగ్ని 2 స్మార్ట్ ఫోన్ ఈ ఘనతను దక్కించుకుంది.
Also Read: Honor 200 Series: సినిమాటిక్ కెమెరాతో కొత్త సిరీస్ వస్తోంది.!
ఈ అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే, ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చే అవకాశం ఉండవచ్చు అని గట్టిగా విశ్వసిస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile