Lava Blaze 5G: కేవలం రూ.9999 ధరలో భారతీయ 5G ఫోన్ లాంచ్.!

Lava Blaze 5G: కేవలం రూ.9999 ధరలో భారతీయ 5G ఫోన్ లాంచ్.!
HIGHLIGHTS

Lava Blaze 5G ను ఈరోజు అధికారికంగా ప్రకటించింది

కేవలం రూ.9999 ధరలో లాంచ్ చేసిన లావా

ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు

ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ సంస్థ LAVA ఎట్టకేలకు తన సరసమైన 5G స్మార్ట్ ఫోన్ Lava Blaze 5G ను ఈరోజు అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ నుండి ఈ ఫోన్ గురించి అత్యంత గోప్యంగా వ్యవహరించిన లావా ఈరోజు ఈ ఫోన్ యొక్క ధర వివరాలను వెల్లడించింది. వాస్తవానికి, ఈ ఫోన్ ధర 10 వేల రూపాయల లోపలే ఉంటుందని ముందుగానే హింట్ ఇచ్చింది. అయితే, ఈ ఫోన్ కేవలం రూ.9999 రుపాయల ధరలో మాత్రమే వచ్చిన కూడా, ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్లు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్దామా. 

Lava Blaze 5G: ధర

Lava Blaze 5G  బేసిక్ వేరియంట్ ను స్పెషల్ లాంచ్ అఫర్ లో భాగంగా రూ.9,999 ధరతో ప్రకటించింది. ఇది కేవలం 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగిన సింగల్ వేరియంట్ తో వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ద్వారా లిస్టింగ్ చేయబడుతుంది. ఈ ఫోన్ యొక్క సేల్ డేట్  ఇంకా ప్రకటించనప్పటికీ, notify me బటన్ ను నొక్కడం ద్వారా సేల్ కి అందుబాటులోకి రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.    

Lava Blaze 5G: స్పెక్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ నోచ్ లో 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ స్కానర్ వుంది. లావా బ్లేజ్ 5G మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4G ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

బ్లేజ్ 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 50MP మైన్ కెమెరాతో పాటుగా డెప్త్ మరియు మ్యాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 OS పైన పనిచేస్తుంది మరియు 5,000mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్‌ లకు ఈ ఫోన్ లో సపోర్ట్ వుంది. ఈ ఫోన్ అన్ని ఇండియన్ బ్యాండ్ 5G లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo