Lava Blaze Dragon: ఒక్కరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఫస్ట్ డే సేల్ అవుతుంది.!
Lava Blaze Dragon మరో రెండు రోజుల్లో సేల్ కి అందుబాటులోకి వస్తుంది
లావా ఈ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
ఎక్స్ చేంజ్ బోనస్ తో కేవలం రూ. 8,999 రూపాయల ధరలో లభిస్తుంది
Lava Blaze Dragon : ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ మరో రెండు రోజుల్లో సేల్ కి అందుబాటులోకి వస్తుంది. లావా ఈ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ అండర్ 10,000 బడ్జెట్ ఫోన్ గా మార్కెట్లో అడుగుపెట్టింది మరియు ఫస్ట్ సేల్ నుంచి 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కోసం మీరు కూడా ఎదురుచూస్తుంటే, ఫస్ట్ సేల్ గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
SurveyLava Blaze Dragon : ధర
ఈ ఫోన్ ను కేవలం రూ. 9,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ లావా లేటెస్ట్ 5జి ఫోన్ గోల్డెన్ మిస్ట్ మరియు మిడ్ నైట్ మిస్ట్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది మరియు ఈ ఫోన్ అమెజాన్ నుండి సేల్ అవుతుంది. ఈ ఫోన్ పై 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ని లావా అందించింది. అంటే, ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి ఈ అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ తో కేవలం రూ. 8,999 రూపాయల ధరలో లభిస్తుంది.
Lava Blaze Dragon: ఫీచర్లు
లావా ఈ ఫోన్ ను అండర్ 10,000 బడ్జెట్ సెగ్మెంట్ ప్రైస్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 450+ కంటే అధిక AnTuTu స్టోరేజ్ కలిగిన క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 4 జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ అంతర్గత మెమరీ కలిగి ఉంటుంది.

ఈ లావా 5జి స్మార్ట్ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మల్టీ కెమెరా సెటప్ మరియు ఆకట్టుకునే ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.75 ఇంచ్ 2.D డిస్ప్లేని HD + రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. లావా బ్లేజ్ డ్రాగన్ స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది మరియు ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: CMF Phone 2 Pro పై భారీ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ఈ లావా ఫోన్ లేటెస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది మరియు బ్లోట్ వేర్ ఫ్రీ గా ఉంటుంది. ఇందులో ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా లావా యొక్క ఫ్రీ హోమ్ సర్వీస్ సౌలభ్యం కలిగి ఉంటుంది.