Lava Blaze 3 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన లావా కొత్త బడ్జెట్ 5జి ఫోన్ సేల్.!
Lava Blaze 3 5G సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది
Vibe Lite వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ ను అందించింది
ఈ ఫోన్ ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతోంది
Lava Blaze 3 5G: ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా రీసెంట్ గా విడుదల చేసిన లావా బ్లేజ్ 3 5జి స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. బడ్జెట్ ధరలో ప్రీమియం గ్లాస్ బ్యాక్ మరియు వైబ్ లైట్ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ ను అందించింది. ఈ ఫోన్ ఈరోజు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతోంది.
SurveyLava Blaze 3 5G: ప్రైస్
లావా ఈ ఫోన్ కేవలం 6GB + 128GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో రూ. 11,499 రూపాయల ధరతో ఈ ఫోన్ ను అందించింది. ఈ ఫోన్ పైన రూ. 500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను SBI Debit Card మరియు క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 9,999 ధరకే అందుకునే అవకాశం అందించింది.
Also Read: WhatsApp New Feature: వాట్సాప్ లో రెగ్యులర్ గా స్టేటస్ అప్డేట్ చేసే వారికి గుడ్ న్యూస్.!
Lava Blaze 3 5G: ఫీచర్స్
లావా ఈ ఫోన్ ను పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.5 ఇంచ్ HD+ స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14OS పై నడుస్తుంది. ఈ ఫోన్ లో 6GB ఫిజికల్ ర్యామ్ + 6GB వర్చువల్ ర్యామ్ తో కలిపి 12GB ర్యామ్ ఫీచర్ అందిస్తుంది మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ లావా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ సరికొత్త Vibe Light సపోర్ట్ కలిగిన 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టంను కలిగి వుంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాతో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ సపోర్ట్ వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile