బడ్జెట్ ధరలో బిగ్ ర్యామ్ తో వచ్చిన Lava Blaze 2 సేల్ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది.!

HIGHLIGHTS

లావా మొబైల్స్ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన Lava Blaze 2

Lava Blaze 2 మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది

బిగ్ ర్యామ్, ఆకర్షణీయమైన డిజైన్ వంటి ప్రత్యేకతలతో వచ్చింది

లావా మొబైల్స్ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన Lava Blaze 2 మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. బడ్జెట్ ధరలో వచ్చిన ఈ లావా స్మార్ట్ ఫోన్ బిగ్ ర్యామ్, ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫాస్ట్ UFS 2.2 బిగ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలతో వచ్చింది. రేపటి నుండి సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ లావా బ్లేజ్ 2 స్మార్ట్ ఫోన్ కంప్లీట్ వివరాలను ఇక్కడ చూడవచ్చు. 

Lava Blaze 2: ధర

లావా బ్లేజ్ 2 స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ తో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.8,999 రూపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది. 

Lava Blaze 2: ప్రత్యేకతలు

ఇక లావా బ్లేజ్ 2 స్పెక్స్ మరియు ఫీచర్ల గురించి చూస్తే, ఈ స్మార్ట్ ఫోన్ Unisoc T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ మరియు 5GB  వర్చువల్ ర్యామ్ ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ టైప్-C పోర్ట్ తో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ తో వచ్చింది. ఈ ఫోన్ లో వెనుక 13MP AI డ్యూయల్ కెమేరా సెటప్ మరియు ఫ్రెంట్ 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ఈ ఫోన్ డిస్ప్లే మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 ఇంచ్ HD+ (1600 x 720) రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంది. ఈ ఫోన్ Android 12 OS పైన పనిచేస్తుంది మరియు ఆటో కాల్ రికార్డ్ చేసే ఫీచర్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :