Lava Blaze 2 5G: అత్యంత చవకైన 5G ఫోన్ Sale ఈరోజు నుండి మొదలయ్యింది.!

Lava Blaze 2 5G: అత్యంత చవకైన 5G ఫోన్ Sale ఈరోజు నుండి మొదలయ్యింది.!
HIGHLIGHTS

Lava Blaze 2 5G సేల్ ఈరోజు నుండి నుండి మొదలయ్యింది

లావా బ్లేజ్ 2 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ 5జి స్మార్ట్ ఫోన్ 10 వేల కంటే తక్కువ ధరలో లాంచ్ అయ్యింది

ఇండియన్ మార్కెట్ లో అత్యంత చవకైన 5G ఫోన్ Lava Blaze 2 5G సేల్ ఈరోజు నుండి నుండి మొదలయ్యింది. రీసెంట్ గా లావా చాలా తక్కువ ధరలో విడుదల చేసిన లావా బ్లేజ్ 2 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ 5జి స్మార్ట్ ఫోన్ 10 వేల కంటే తక్కువ ధరలో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు స్పెక్స్ తెలుసుకోండి.

Lava Blaze 2 5G Price

లావా బ్లేజ్ 2 5జి స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (4GB RAM + 64GB) రూ. 9,999 రూపాయల ధరతో వచ్చింది. అలాగే, (6GB RAM + 128GB) వేరియంట్ రూ. 10,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమేజాన్ మరియు లావా అధికారిక వెబ్సైట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే, అమేజాన్ నుండి ఈ ఫోన్ కొనుగోలు చేసే యూజర్లకు ఫినాలే డేస్ సేల్ 10% బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. అంటే, ఈ ఫోన్ ను మరింత చవక ధరకు అందుకోవచ్చన్న మాట.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్ తో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read : Flipkart Great Deal: భారీ తగ్గింపుతో 40 వేలకే 65 ఇంచ్ Smart TV అందుకోండి.!

లావా బ్లేజ్ 2 5జి ప్రత్యేకతలు

లావా బ్లేజ్ 2 5జి స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ డిస్ప్లేని 90Hz Punch Hole డిజైన్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే HD+ రిజల్యూషన్ అందించే IPS డిస్ప్లే మరియు మంచి బ్రైట్నెస్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6020 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 46GB / 6GB ర్యామ్ తో పాటు ఎక్స్ ప్యాండబుల్ RAM మరియు 64GB / 128GB (UFS 2.2) ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది.

ఈ ఫోన్ కెమేరాల ప్రరంగా వెనుక 50MP AI డ్యూయల్ కెమేరాని మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ లావా బడ్జెట్ 5జి ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ, Android 13 OS మరియు ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ వంటి ఫీచర్స్ తో ఈ ఫోన్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo