Lava AMOLED 2 5G: స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో లావా కొత్త ఫోన్ తెచ్చింది.!
ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది
Lava AMOLED 2 5G ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకునే బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది
లావా ఈ ఫోన్ ను కేవలం రూ. 13,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది.
Lava AMOLED 2 5G: ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు సోనీ కెమెరా వంటి చాలా ఫీచర్స్ తో ఆకట్టుకునే బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది. లావా సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyLava AMOLED 2 5G: ప్రైస్
లావా ఈ ఫోన్ ను కేవలం రూ. 13,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం సింగల్ వేరియంట్ తో లాంచ్ అయ్యింది మరియు ఆగస్టు 16వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు అన్ని రిటైల్ స్టోర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్ మరియు ఫెదర్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది.
Lava AMOLED 2 5G: ఫీచర్స్
ఈ లావా స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ లావా ఫోన్ ను 500K+ AnTuTu స్కోర్ అందించగల మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 7060 తో అందించింది. ఈ చిప్ సెట్ కి జతగా 6GB LPDDR5 ఫిజికల్ ర్యామ్, 6 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది.

ఈ ఫోన్ కెమెరా పరంగా కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో 50MP (Sony IMX752) ప్రధాన కెమెరా కలిగిన డయల్ రియర్ కెమెరా మరియు ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ HDR ఫోటోలు మరియు వీడియో సపోర్ట్ కలిగి ఉంటుందని లావా తెలిపింది. ఈ లావా ఫోన్ కేవలం 7.55mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. అయితే, ఇంత సన్నని డిజైన్ లో కూడా ఈ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Oppo K13 Turbo 5G: బడ్జెట్ ధరలో సరికొత్త కూలింగ్ ఫ్యాన్ టెక్ తో లాంచ్ అయ్యింది.!
ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 15 OS తో నడుస్తుంది. ఈ ఫోన్ 1 మేజర్ OS అప్డేట్ మరియు 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంది. ఈ లావా ఫోన్ IP 64 రేటింగ్ తో వస్తుంది మరియు డస్ట్ అండ్ వాటర్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ కూడా లావా యొక్క ఉచిత హోమ్ సర్వీస్ ఫీచర్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
