Oppo K13 Turbo 5G: బడ్జెట్ ధరలో సరికొత్త కూలింగ్ ఫ్యాన్ టెక్ తో లాంచ్ అయ్యింది.!
Oppo K13 Turbo 5g స్మార్ట్ ఫోన్ ను కూడా ఒప్పో ఈరోజు ఇండియాలో విడుదల చేసింది
ఈ ఫోన్ ఒప్పో కె13 టర్బో సిరీస్ లో బడ్జెట్ ఫోన్ గా వచ్చింది
బడ్జెట్ ధరలో సరికొత్త కూలింగ్ ఫ్యాన్ టెక్ తో లాంచ్ అయ్యింది
Oppo K13 Turbo 5g స్మార్ట్ ఫోన్ ను కూడా ఒప్పో ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ఒప్పో కె13 టర్బో సిరీస్ లో బడ్జెట్ ఫోన్ గా వచ్చింది. అయితే , బడ్జెట్ ధరలో సరికొత్త కూలింగ్ ఫ్యాన్ టెక్ తో లాంచ్ అయ్యింది. హెవీ గేమింగ్ మరియు హెవీ మల్టీ టాస్కింగ్ సమయంలో సైతం ఫాలెన్ ను వేగంగా చల్లబరిచే కొత్త బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్ తేజ్ తో ఈ ఫోన్ ను అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లేటెస్ట్ మీడియాటెక్ ఫాస్ట్ ప్రోసెసర్ మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లు కలిగి ఉంటుంది.
SurveyOppo K13 Turbo 5G: ప్రైస్
ఒప్పో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఇందులో (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 27,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 29,999 ధరతో లాంచ్ చేసింది. ఆగస్టు 18వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ లను ఈరోజు నుంచి ప్రారంభించింది.
Oppo K13 Turbo 5G:
ఈ ఫోన్ ను కూడా కొత్త కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీ తో లాంచ్ చేసింది. ల్యాప్ టాప్ లో ఉండే ఫ్యాన్ మాదిరిగా ఈ ఫోన్ లో ఉండే కూలింగ్ ఫ్యాన్ ఈ ఫోన్ ను వేగంగా చల్లబరుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో చాలా పెద్దదైన 7000 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ అల్రౌండ్ ఆర్మర్ బాడీ కలిగి చాలా పటిష్టమైన డిజైన్ ను ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ IPX6, IPX8 మరియు IPX9 రేటింగ్ తో గొప్ప వాటర్ ప్రూఫ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 6.79 ఇంచ్ AMOLED స్క్రీన్ ను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు గట్టి గ్లాస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 8450 తో లాంచ్ అయ్యింది. ఇది 16,60,000 AnTuTu స్కోర్ అందిస్తుంది మరియు వేగంగా ఉంటుంది. దీనికి జతగా 8GB LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజ్ కలిగి ఉంటుంది.
Also Read: Oppo K13 Turbo Pro: మొబైల్ మార్కెట్ ఎన్నడూ చూడని కొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఈ ఒప్పో ఫోన్ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్లు కలిగిన 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 16MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు 300% పవర్ వాల్యూమ్ వంటి ఆడియో ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.