శామ్సంగ్ గెలాక్సీ M30 గురించిన ఈ ముఖ్య విషయాలు మీకు తెలుసా?

శామ్సంగ్  గెలాక్సీ M30 గురించిన ఈ ముఖ్య విషయాలు మీకు తెలుసా?
HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ M30 వెనుక 13MP +5MP+5MP ట్రిపుల్ కెమేరా సేతప్పుతో వస్తుంది.

ముందుగా, శామ్సంగ్  తన గెలాక్సీ M సిరీస్ నుండి గెలాక్సీ M10 మరియు గెలాక్సీ M20 స్మార్ట్ర్ ఫోన్లను గొప్ప ఫీచర్లతో అత్యంత సరసమైన ధరలో తీసుకువచ్చింది. ఇదే భాటలో ఇప్పుడు ఇదే సిరీస్ నుండి మరోక స్మార్ట్ ఫోన్ అయినటువంటి, గెలాక్సీ M30 ని కూడా తీసుకొచ్చింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను ఒక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 15W స్పీడ్ ఛార్జ్ టక్నాలజీతో పాటుగా టైపు- C పోర్ట్ వంటి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో అందిస్తుంది. ఇక  ఫోన్ గురించి మీరు 10 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.   

1. శామ్సంగ్  గెలాక్సీ M30  ఒక 6.4 అంగుళాల FHD + సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. దీనితో, మీరు డైనమిక్ కలర్స్ మరియు పదునైన కాంట్రాస్ట్ తో మంచి వీక్షణానుభూతిని పొందుతారు. 
2. ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని అంచులు కలిగి ఉంటుంది మరియు 19.5:9  ఆస్పెక్ట్ రేషియాతో దాదాపుగా 90% ఎక్కువగా స్క్రేన్ రేషియోని అందిస్తుంది. 
3. శామ్సంగ్  గెలాక్సీ M30 వెనుక 13MP +5MP+5MP ట్రిపుల్ కెమేరా సేతప్పుతో వస్తుంది. ఇందులో 13MP ప్రధాన కెమేరా f /1.9 అపర్చరుతో వస్తుంది, ఒక 5MP పోర్ట్రైట్ లకోసం డెప్త్ సెన్సార్ కాగా, మరొక 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 
4. ముందుభాగంలో ఒక 16MP సెన్సార్ తో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.  ఈ ఫోనులో అందించిన స్టిక్కర్లతో మంచి ఫన్నీ ఫోటలను కూడా తీసుకోవచ్చు. 
5.  ఈ ఫోన్ ఒక పెద్ద 5000mAh బ్యాటరీతో వస్తుంది మరియు దీన్ని అత్యున్నత వేగంగా ఛార్జ్ చేయగల ఒక 15W ఫాస్ట్ చార్జర్ కూడా బాక్స్ లోనే అందించారు. అలాగ, ఇది ఒక టైప్ – C పోర్టుతో వస్తుంది. 
6. గెలాక్సీ M30 ఒక Exynos 7904 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. ఇది స్పీడుగా పనిచేయగల LPDDR4X RAM తో వస్తుంది.అలాగే, జతగా 4GB లేదా 6GB ర్యామ్ తో వస్తుంది. అంతర్గతంగా,  64GB మరియు 128GB స్టోరేజిని అఫర్ చేస్తోంది. 
7. ముఖ్యంగా, ఈ ఫోన్ HD కంటెంట్ వీడియోలను ప్లే చేయడం కోసం అవసరమైన Widevine L1 ద్రువీకరణమతో వస్తుంది మరియు DOLBYATMOS సిస్టం ఇందులో అందించారు. 
8.  ఈ ఫోన్, 8.5MM మందంతో సన్నగా మరియు గ్రేడియంట్ బ్లూ, గ్రేడియంట్ బ్లాక్ వంటి రెండు రంగులలో లభిస్తుంది
9. ఇందులో, సెక్యూరిటీ ఫీచర్లుగా, ఫింగర్ ప్రింట్ మరియు పేస్ అన్లాక్ ఫీచర్లను అందించారు. అంటే దీని ఇప్పుడు డబుల్ సెఫ్టీ మీకు దొరుకుతుందన్నమాట. 
10. శామ్సంగ్  గెలాక్సీ M30 రెండు వీరియంట్ల ధరలు  
          
1.  శామ్సంగ్  గెలాక్సీ M30 4GB + 64GB : Rs. 14,990       
2. శామ్సంగ్  గెలాక్సీ M30  6GB + 128GB : Rs. 17,990

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo