జియో ‘WeChat’ వంటి ఆల్-ఇన్ -వన్ సూపర్ ఆప్ సిద్ధం చేస్తోంది.

జియో ‘WeChat’ వంటి ఆల్-ఇన్ -వన్ సూపర్ ఆప్ సిద్ధం చేస్తోంది.
HIGHLIGHTS

Jio యొక్క సూపర్ ఆప్ ఇ-కామర్స్, ఆన్లైన్ బుకింగ్స్, మరియు పెమెంట్స్ , వంటి అనేక విషయాలను ఒకే చోట అందిస్తుంది.

ఈ టెలికాం ఆపరేటర్ 100 కొత్త సర్వీసులను అందించే, ఒక కొత్త "సూపర్ అప్లికేషన్" ను సిద్ధం చేస్తోంది.

ఇటీవలే, 30.6 కోట్ల మంది చందాదారులతో భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటరుగా, రిలయన్స్ జీయో  అవతరించింది. ఇది 28.4 కోట్ల మంది చందాదారులతో వున్న ఎయిర్టెల్ ని  అధిగమించింది. జీయో తన పోటీదారుల కంటే అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్లు  మరియు ఎక్కువ డేటాను అందించడం ద్వారా ఈ ఘనతను సాధించిందని చెప్పవచ్చు. ఇప్పుడు, ముకేష్ అంబానీ నేతృత్వంలోని, ఈ టెలికాం ఆపరేటర్ 100 కొత్త సర్వీసులను అందించే, ఒక కొత్త "సూపర్ అప్లికేషన్" ను సిద్ధం చేస్తోంది. ఒక IANS నివేదిక Jio యొక్క సూపర్ ఆప్  ఇ-కామర్స్, ఆన్లైన్ బుకింగ్స్, మరియు పెమెంట్స్ , వంటి అనేక విషయాలను ఒకే చోట అందిస్తుంది.

  'నిపుణుల' ప్రకారం,  మల్టి సర్వీసులతో కూడిన ఒక సూపర్ అప్లికేషన్ను ప్రకటించినట్లయితే, ఇది భారతదేశం యొక్క WeChat ను సృష్టించగలదని IANS చెబుతుంది. తేలికో ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్న అనేకరకల అప్లికేషన్లను కలిగి ఉన్నందున ఇది నిజం కావచ్చు. "జియో పరికరాల సర్వవ్యాప్తి,  రిలయన్సును శక్తివంతమైన స్థానంలో ఉంచింది. ఇది దాని వినియోగదారుల విస్తారమైన ఎకో సిస్టమ్ ను ఒక మల్టి -లేయర్డ్ ఫాబ్రిక్ తో  అనుసంధానిస్తుంది, అంటే సర్వీసుల యొక్క గొప్ప సిరీస్ను అందిస్తోంది, సింగిల్ -స్టాప్, సూపర్ ఆప్  ద్వారా ఆన్లైన్-నుండి-ఆఫ్ లైన్ కు కనెక్ట్ చేస్తుంది, " అని   ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (IIG), హెడ్ అయినటువంటి, ప్రభు రామ్, CMR, IANS తో చెప్పారు. "భారతదేశం ఒక మొబైల్ – ఫిస్ట్ కంట్రీ మరియు సౌకర్యవంతమైన సదుపాయాన్ని అందించే ఇలాంటి  స్వయం – నిరోధిత నెట్వర్క్,  డిమాండ్ వినియోగదారులతో అనుకూలంగా ఉంటుంది"

అప్లికేషన్ డెవలపర్లు ఆప్ లను అభివృద్ధి చేయడానికి టెక్ స్టాక్ను ఉపయోగిస్తాయి, ఇది ఫ్రేంవర్క్స్, టూల్స్ మరియు ప్రోగ్రామింగ్ భాషల కలయికగా ఉంటుంది. రిలయన్స్ జీయో చేత ఉపయోగించబడిన టెక్ స్టాక్ ఒక సంభాషణాత్మక కృత్రిమ మేధస్సు (AI) లేయర్, లాజిస్టిక్స్ లేయర్, లోకల్ వాయిస్ టెక్ లేయర్, మరియు AI ఆధారిత ఎడ్యుకేషన్ లేయరును కలిగి ఉంటుంది. ఈ లేయర్ల సహాయంతో, జియో పరికరాల పైన పెట్టినప్పుడు,   WeChat  వంటి ఒక ఎకో సిస్టం  భారత్ సృష్టించుకోవచ్చని, రామ్ చెప్పారు. రిలయన్స్ రిటైల్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ త్వరలోనే ప్రారంభించనుంది. ఇది ప్రస్తుతం అంతర్గత పరీక్షలో ఉందని మరియు అమెజాన్, ఫ్లిప్కార్ట్, పెటియం  మరియు మరికొన్ని ఇటువంటి ఆన్లైన్ రిటైలర్లపై తీవ్రప్రభావం చూపుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo