Zeno 5G: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న బ్రాండ్ గా భారత మార్కెట్లో స్థానం సంపాదించుకున్న itel, తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఐటెల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ జెనో నుంచి లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో తీసుకొస్తున్నట్లు టీజర్ ద్వారా ఐటెల్ వెల్లడించింది.
Survey
✅ Thank you for completing the survey!
Zeno 5G : లాంచ్
ఐటెల్ జెనో 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే, Coming Soon లైన్ తో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఐటెల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. అమెజాన్ అందించిన టీజర్ పేజి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది.
ఐటెల్ జెనో 5జి స్మార్ట్ ఫోన్ కేవలం 7.8mm స్లిమ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు మంచి క్లీన్ డిజైన్ తో లాంచ్ ఐటెల్ చేస్తోంది. ఐటెల్ జెనో 5జి ఫోన్ Aivana AI వాయిస్ అసిస్టెంట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ చాలా పనులు జెస్ట్ వాయిస్ కమాండ్ తోనే నిర్వహిస్తుందని ఐటెల్ చెబుతోంది. ఓపెన్ ఫేస్ బుక్, స్టార్ట్ టేకింగ్ ఫోటో, ఓపెన్ కెమెరా లేదా ఓపెన్ యూట్యూబ్ అని వాయిస్ కమాండ్ ఇవ్వగానే AI సహాయంతో ఈ ఫోన్ ఇచ్చిన కమాండ్ ప్రకారం కెమెరా ఓపెన్ చేయడం, ఫోటోలు తీయడం వంటి పనులు చేస్తుంది.
ఈ ఫోన్ ను డయల్ 5G SIM సపోర్ట్ తో లాంచ్ చేస్తుంది. ఇది లేటెస్ట్ నెట్ వర్క్ సపోర్ట్ తో మంచి 5G కనెక్టివిటీ అందిస్తుందని ఐటెల్ పేర్కొంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ సెటప్ ఉన్నట్లు ఫోన్ టీజర్ ఇమేజ్ సూచిస్తోంది. ఇందులో MAXX Camera అని కెమెరా మోడ్యూల్ పక్కనే రాసి ఉంది. ఈ ఫోన్ యొక్క మరో రెండు ఫీచర్ కూడా ఐటెల్ వెల్లడించింది.
ఐటెల్ జెనో 5జి స్మార్ట్ ఫోన్ IP54 రేటింగ్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో స్మూత్ విజువల్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో గొప్ప ఆఫర్ ను కూడా ముందే కంపెనీ అనౌన్స్ చేసింది. అదేమిటంటే, ఈ ఫోన్ తో 100 రోజుల ఉచిత స్క్రీన్ రిప్లేస్మెంట్ ఆఫర్ అందిస్తుంది. మొత్తంగా ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేయడానికి ఐటెల్ యోచిస్తున్నట్లు వ్యక్తం అవుతోంది.