మంచి మ్యూజిక్ వినడానికి లేదా ఇంట్లో కలిగి ఉన్న స్మార్ట్ టీవీ కి తగిన సౌండ్ బార్ కోసం చూసే వారికి ఈరోజు తగిన డీల్స్ లభిస్తున్నాయి. అవేమిటంటే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు బెస్ట్ బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తున్న 5.1 Soundbar డీల్స్. బడ్జెట్ సౌండ్ బార్ అని ఎందుకు అంటున్నానంటే, అన్ని ఆఫర్స్ కలుపుకొని ఈ సౌండ్ బార్స్ కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి. మీరు కూడా 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త 5.1 ఛానల్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే, మేము అందించిన ఈ డీల్స్ పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
5.1 Soundbar : ఆఫర్
ఈరోజు ఫ్లిప్ కార్ట్ రెండు బెస్ట్ 5.1 సౌండ్ బార్ లను మంచి ఆఫర్స్ తో 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఇక డీల్స్ విషయానికి వస్తే, జెబ్రోనిక్స్ యొక్క Juke Bar 7450 మరియు మివి యొక్క Fort H350 రెండు సౌండ్ బార్స్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.
ముందుగా మివి సౌండ్ బార్ ఆఫర్స్ చూస్తే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 83% డిస్కౌంట్ తో రూ. 5,799 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ని BOBCARD EMI తో తీసుకునే యూజర్లు రూ. 579 రూపాయల డిస్కౌంట్ అందుకుంటారు. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,220 ధరకే లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 350W హెవీ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఇది HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 70% డిస్కౌంట్ తో రూ. 6,299 ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను BOBCARD EMI ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 629 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,670 ధరకే లభిస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో కూడా మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ USB, AUX, HDMI Arc మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ తో వస్తుంది.