iQOO Z9X 5G: చవక ధరలో 6000 mAh బ్యాటరీ మరియు SD 6 Gen 1 చిప్సెట్ తో వచ్చింది.!

HIGHLIGHTS

iQOO Z9X 5G ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల అయ్యింది

6000 mAh బ్యాటరీ మరియు SD 6 Gen 1 చిప్సెట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో విడుదల చేసింది

లాంచ్ ఆఫర్లను కూడా ఈ ఫోన్ లాంచ్ తో పాటు ప్రకటించింది

iQOO Z9X 5G: చవక ధరలో 6000 mAh బ్యాటరీ మరియు SD 6 Gen 1 చిప్సెట్ తో వచ్చింది.!

iQOO Z9X 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల అయ్యింది. ఈ ఫోన్ ను చవక ధరలో 6000 mAh బ్యాటరీ మరియు SD 6 Gen 1 చిప్సెట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఐకూ విడుదల చేసింది. అంతేకాదు, ఈ కొత్త ఫోన్ ను మరింత తక్కువ ధరకు అందుకునేలా లాంచ్ ఆఫర్లను కూడా ఈ ఫోన్ లాంచ్ తో పాటు ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ ఫీచర్లు మరియు ప్రైస్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z9X 5G Price

ఐకూ ఈ ఫోన్ ను రూ. 12,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది 4GB + 128GB బేసిక్ వేరియంట్ కోసం అందించిన ధర. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ ను రూ.14,999 ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ ను రూ. 15,999 ధరతో లాంచ్ చేసింది.

అఫర్స్

ఈ ఫోన్ పైన ICICI మరియు SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కోన్ వారికి రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు 6GB మరియు 8GB వేరియంట్స్ పైన రూ. 500 రూపాయల అదనపు తగ్గింపు కూపన్ కూడా అందించింది.

Also Read: Motorola Edge 50 Fusion: బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది.!

iQOO Z9X 5G: ఫీచర్లు

ఐకూ జెడ్ 9 5జి ఫోన్ Snapdragon 6 Gen 1 5G తో పని చేస్తుంది మరియు జత 8GB ర్యామ్ మరియు 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 6000 mAh హెవీ బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందించింది. ఈ ఐకూ ఫోన్ Funtouch OS స్కిన్ పైన ఆండ్రాయిడ్ 14 OS పైన నడుస్తుంది.

iQOO Z9X 5G Features
iQOO Z9X 5G Features

ఇక ఈ ఫోన్ డిజైన్ మరియు డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ ను చాలా స్లీక్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 6.72 ఇంచ్ LCD డిస్ప్లే FHD+ రిజల్యూషన్ సపోర్ట్ తో వుంది. ఈ స్క్రీన్ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి మరియు ఈ ఫోన్ IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో 50 MP AI Camera (main) + 2 MP (Bokeh) డ్యూయల్ రియర్ మరియు 8 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo