iQOO Z9X 5G: మే 16 న వస్తున్న కొత్త ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

ఐకూ Z9 సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

ఈ ఫోన్ ను మే 16 వ తేదీ భారత్ ట్లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది

ఐకూ జెడ్ 9x 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతుంది

iQOO Z9X 5G: మే 16 న వస్తున్న కొత్త ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

iQOO Z9X 5G: ఐకూ సక్సెస్ బడ్జెట్ ఫుల్ సిరీస్ Z9 సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే, ఐకూ జెడ్ 9x 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను మే 16 వ తేదీ భారత్ ట్లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను తెలియ చేస్తూ టీజింగ్ ను కూడా ఐకూ మొదలు పెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z9X 5G: Launch

పైన తెలిపిన విధంగా మే 16 న ఐకూ జెడ్ 9x 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను ఫీచర్స్ తో అమెజాన్ మైక్రో సైట్ పేజి ను అందించి, దాని ద్వారా టీజింగ్ చేస్తోంది.

iQOO Z9X 5G: టీజ్ ఫీచర్స్

ఐకూ జెడ్ 9x 5జి స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే, ప్రోసెసర్, బ్యాటరీ, కెమెరా మరియు డిజైన్ వివరాలు ఐకూ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.72 ఇంచ్ బిగ్ డిస్ప్లే ఉన్నట్లు ఐకూ తెలిపింది.

iQOO Z9X 5G Specs
iQOO Z9X 5G Specs

ఈ జెడ్ 9x 5జి ఫోన్ క్వాల్కమ్ Snapdragon 6 Gen 1 5G ప్రోసెసర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ మరింత పెర్ఫార్మెన్స్ అందించేందుకు, ఇందులో 8GB ఫిజికల్ RAM మరియు 8GB Extended RAM తో కూడా జతగా వస్తుందని ఐకూ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ లో 1TB వరకు ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్ అవకాశం కూడా ఉంటుంది.

Also Read: Netflix OTT సబ్ స్క్రిప్షన్ ఉచితంగా కావాలా.. అయితే, ఈ ఎయిర్టెల్ ప్లాన్ పై ఒక లుక్కేయండి.!

ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు డ్యూయల్ టోన్ ఫ్లాష్ కూడా వుంది. ఈ ఫోన్ ను హెవీ 6000 mAh బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా తీసుకు వస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఇవి కాకుండా, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP64 వాటర్ & డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ లేటెస్ట్ Android 14 OS తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఐకూ వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile