iQOO Z7 Pro 5G launched: తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్ తో లాంచ్.!

HIGHLIGHTS

iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ 3D Curved డిస్ప్లేతో లాంచ్ అయ్యింది

64MP OIS కెమేరా సెట్టింగ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్

iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ రూ. 23,999 రూపాయల స్టార్టింగ్ ధరతో లాంచ్

iQOO Z7 Pro 5G launched: ఈరోజు ఇండియన్ మార్కెట్ లో మరొక అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. అదే, iQOO Z7 Pro 5G  స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 3D Curved AMOLED డిస్ప్లే, 64MP OIS కెమేరా సెట్టింగ్ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో ఐకూ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ధరను మాత్రం భారత్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలోనే మార్క్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ మరింత తక్కువ ధరకే పొందేలా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను కూడా ఐకూ జత చేసింది. ఈరోజే ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టిన ఈ లేటెస్ట్ iQOO స్మార్ట్ ఫోన్  విశేషాలు ఏమిటో చేసేద్దామా. 

iQOO Z7 Pro 5G Price

iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 23,999 రూపాయల స్టార్టింగ్ ధరతో లాంచ్ చేసింది. ఈ స్టార్టింగ్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. రెండవ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ. 24,999. 

ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ కార్డ్ అఫర్ ను ఐకూ జత చేసింది మరియు ఎక్స్ చేంజ్ అఫర్ ను అందించింది. iQOO Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ ను HDFC, SBI బ్యాంక్ కార్డ్స్ అఫర్ తో కొనేవారు రూ. 2,000 స్పాట్ తగ్గింపును అందుకోవచ్చు. ఒకవేళ కార్డ్స్ అఫర్ కాదనుకుంటే ఎక్స్ చేంజ్ పైన రూ. 2,000 అడిషనల్ డిస్కౌంట్ ను పొందవచ్చు. 

ఐకూ లాంచ్ చేసిన ఈ కొత్త ఫోన్ ను ఈ ధరలో అద్భుతమైన ఫోన్ గా చేసే 5 ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. అవేమిటో క్రింద చూడవచ్చు. సెప్టెంబర్ 5 న జరగనున్న iQOO Z7 Pro 5G ఫస్ట్ సేల్ సమయంలో డిజిట్ iQOO Z7 Pro 5G Live Review ని అమేజాన్ ద్వారా టెలికాస్ట్ చేస్తోంది. మీరు iQOO Z7 Pro 5G Live Review ను చూడడానికి Watch Here పైన నొక్కండి. 

iQOO Z7 Pro 5G Display

ఐకూ జెడ్7 ప్రో 6జి స్మార్ట్ ఫోన్ ను ఐకూ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లేతో లంచ్ చేసింది. ఇది 1.07 బిలియన్ కలర్స్ మరియు 1300నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో వస్తుంది. 

iQOO Z7 Pro 5G Processor

ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ సెగ్మెంట్ ఫాస్ట్ ప్రోసెసర్ Dimensity 7200 SoC శక్తితో పని చేస్తుంది. ఇది ధర పరిధిలో మంచి పనితనం కలిగిన ప్రోసెసర్ అని చెప్పవచ్చు. 

iQOO Z7 Pro 5G Performence

ఈ ఫోన్ ఫాస్ట్ ప్రోసెసర్ కి తగిన 8GB ర్యామ్ మరియు 256GB వరకూ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ఇది Funtouch OS 13 సాఫ్ట్ వేర్ ఆధారితమైన Android 13 OS పైన పని చేస్తుంది.  

iQOO Z7 Pro 5G Camera

ఈ ఫోన్ లో ప్రొఫెషనల్ గ్రేడ్ కెమేరాలను అందించినట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఐకూ ఫోన్ లో వెనుక OIS సపోర్ట్ Aura Ring సపోర్ట్ కలిగిన 64MP మెయిన్ కెమేరా + 2MP బొకే కేమెరా గల డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా వుంది. 

iQOO Z7 Pro 5G Battery

iQOO Z7 Pro 5G  స్మార్ట్ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4600 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :