iQOO Z7 5G: భారీ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ బెస్ట్ డీల్స్ తో సేల్ అవుతోంది.!

Updated on 31-Mar-2023
HIGHLIGHTS

iQOO Z7 5G భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది

లాంచ్ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ పైన బెస్ట్ డీల్స్ ను కూడా కంపెనీ అందించింది

ఈ ధర సెగ్మెంట్ లో 64MP OIS కెమేరా కలిగిన ఏకైక ఫోన్ గా నిలుస్తుంది

ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO Z7 5G భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది. లాంచ్ అఫర్ లో  భాగంగా ఈ ఫోన్ పైన బెస్ట్ డీల్స్ ను కూడా కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ధర సెగ్మెంట్ లో 64MP OIS కెమేరా కలిగిన ఏకైక ఫోన్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఈ లేటెస్ట్ ఐకూ 5G స్మార్ట్ ఫోన్ Extended RAM 3.0 టెక్నాలజీతో అధిక ర్యామ్ ను కూడా అందించగలదని ఐకూ తెలిపింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.

iQOO Z7 5G: ధర మరియు ఆఫర్లు

iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128GB బేసిక్ వేరియంట్ ను రూ.18,999 ధరతో మరియు 8GB ర్యామ్ మరియు 128 స్టోరేజ్ వేరియంట్ ను రూ.19,999 ధరతో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ SBI డెబిట్ కార్డ్ మరియు HDFC కార్డ్స్ తో కొనేవారికి 1,500 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

iQOO Z7 5G: స్పెక్స్

ఈ ఐకూ జెడ్ 7 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.38 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 920 ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 8GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ 3.0 సపోర్ట్ కూడా వుంది. 

ఈ లేటెస్ట్ ఐకూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ డ్యూయల్ కెమెరాలో 64MP (OIS+EIS) సపోర్ట్ కలిగిన ప్రధాన కెమెరాకి జతగా 2MP బొకే కెమెరాని కలిగివుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 4,500mAh బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 13 OS ఆధారిత Funtouch OS 13 పైన పనిచేస్తుంది.  

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :