iQOO Z7 5G: భారీ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ బెస్ట్ డీల్స్ తో సేల్ అవుతోంది.!
iQOO Z7 5G భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది
లాంచ్ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ పైన బెస్ట్ డీల్స్ ను కూడా కంపెనీ అందించింది
ఈ ధర సెగ్మెంట్ లో 64MP OIS కెమేరా కలిగిన ఏకైక ఫోన్ గా నిలుస్తుంది
ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO Z7 5G భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టింది. లాంచ్ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ పైన బెస్ట్ డీల్స్ ను కూడా కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ధర సెగ్మెంట్ లో 64MP OIS కెమేరా కలిగిన ఏకైక ఫోన్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఈ లేటెస్ట్ ఐకూ 5G స్మార్ట్ ఫోన్ Extended RAM 3.0 టెక్నాలజీతో అధిక ర్యామ్ ను కూడా అందించగలదని ఐకూ తెలిపింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.
SurveyiQOO Z7 5G: ధర మరియు ఆఫర్లు
iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128GB బేసిక్ వేరియంట్ ను రూ.18,999 ధరతో మరియు 8GB ర్యామ్ మరియు 128 స్టోరేజ్ వేరియంట్ ను రూ.19,999 ధరతో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ SBI డెబిట్ కార్డ్ మరియు HDFC కార్డ్స్ తో కొనేవారికి 1,500 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
iQOO Z7 5G: స్పెక్స్
ఈ ఐకూ జెడ్ 7 5G స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.38 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 920 ప్రొసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా గరిష్టంగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 8GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ 3.0 సపోర్ట్ కూడా వుంది.
ఈ లేటెస్ట్ ఐకూ 5G ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పు ఉంది. ఈ డ్యూయల్ కెమెరాలో 64MP (OIS+EIS) సపోర్ట్ కలిగిన ప్రధాన కెమెరాకి జతగా 2MP బొకే కెమెరాని కలిగివుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ 4,500mAh బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 13 OS ఆధారిత Funtouch OS 13 పైన పనిచేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile