iQOO Z11 Lite: డైనమిక్ లైట్ మరియు లేటెస్ట్ AI ఫీచర్ తో లాంచ్ కి రెడీ.!

HIGHLIGHTS

ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది

iQOO Z11 Lite కీలక ఫీచర్స్ సైతం కన్ఫర్మ్ చేసింది

iQOO Z11 Lite: డైనమిక్ లైట్ మరియు లేటెస్ట్ AI ఫీచర్ తో లాంచ్ కి రెడీ.!

iQOO Z11 Lite: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ సైతం కన్ఫర్మ్ చేసింది. ఐకూ జెడ్ 11x స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఐకూ, ఇప్పుడు ఐకూ జెడ్ 11 లైట్ ఫోన్ లాంచ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ముఖ్యంగా, డైనమిక్ లైట్ మరియు లేటెస్ట్ AI ఫీచర్ తో లాంచ్ ఈ ఫోన్ లాంచ్ కాబోతున్నట్లు ఐకూ టీజర్ ద్వారా వెల్లడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z11 Lite: లాంచ్ డేట్ ఏమిటి?

ఐకూ జెడ్ 11 లైట్ స్మార్ట్ ఫోన్ ను జూలై 24వ తేదీన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ఐకూ తెలిపింది. ఈ ఫోన్ ను డైలీ యూసేజ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నట్లు ఐకూ పేర్కొంది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చిందింది మరియు ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన టీజర్ పేజీ కూడా అందించింది.

iQOO Z11 Lite: కీలక ఫీచర్స్

ఐకూ జెడ్ 11 లైట్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్, డిజైన్ మరియు కెమెరా వివరాలు ఐకూ వెల్లడించింది. ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్లీక్ అండ్ స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది సోలార్ ఫ్లేమ్ మరియు మిడ్ నైట్ బ్లూ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది మీడియాటెక్ యొక్క బడ్జెట్ చిప్ సెట్ మరియు ఇది మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఇక ఈ చిప్ సెట్ డెప్త్ వివరాల్లోకి వెళితే, ఇది ఆక్టా కోర్ చిప్ సెట్ మరియు ఇది 5,79,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో లేటెస్ట్ AI ఫీచర్స్ కూడా ఆఫర్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో Ai క్రియేషన్, Ai క్యాప్షన్స్, మరియు మరిన్ని Ai కెమెరా ఫీచర్స్ ఉంటాయని ఐకూ తెలిపింది.

కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా సైడ్ లో నోటిఫికేషన్ కోసం ప్రత్యేకమైన డైనమిక్ లైట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కు కాల్ లేదా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేరు వేరు రంగులో ఈ లైట్ వెలుగుతుంది. ఈ ఫోన్ లో 50MP మెయిన్ కెమెరా ఉండొచ్చని అంచనా.

Also Read: Peddi OTT: ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’ .. ఎక్కడ చూడాలంటే.!

ఈ స్మార్ట్ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్లు కూడా త్వరగా ఐకూ వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile