Peddi OTT: ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ ‘పెద్ది’ .. ఎక్కడ చూడాలంటే.!
'పెద్ది' సినిమా ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయ్యింది
థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇంట్లో కుటుంబంతో కలిసి వీక్షించే అవకాశం లభించింది
4K వీడియో క్వాలిటీ మరియు Dolby Atmos ఆడియో సపోర్ట్ తో రిలీజ్ అయ్యింది
Peddi OTT: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘పెద్ది’ సినిమా ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయ్యింది. థియేటర్ లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో భారీ స్పందన ను అందుకున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా గొప్ప భావోద్వేగ కథనం మరియు గ్రామీణ నేపథ్యం మరియు అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను కట్టి[కట్టిపడేసింది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా విడుదల కావడంతో, థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇంట్లో కుటుంబంతో కలిసి వీక్షించే అవకాశం లభించింది.
SurveyPeddi OTT : ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?
‘పెద్ది’ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ Netflix లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. 4K వీడియో క్వాలిటీ, Dolby Atmos ఆడియో సపోర్ట్ తో ఈ సినిమా మరింత మెరుగైన అనుభూతిని అందిస్తుంది. మీకు Netflix సబ్ స్క్రిప్షన్ ఉంటే ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఈ సినిమాను చూడవచ్చు.
‘పెద్ది’ కథ ఏమిటి?
‘పెద్ది’ ఒక సాధారణ గ్రామీణ యువకుడు తన జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించి విజయాన్ని సాధించాడనే అంశం చుట్టూ తిరిగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఈ సినిమా. కుటుంబ బంధాలు, ఆత్మగౌరవం, పట్టుదల, కష్టపడే తత్వం వంటి అంశాలను దర్శకుడు దర్శకుడు బుచ్చిబాబు సానా చాలా భావోద్వేగంగా చూపించారు. కథలో వచ్చే మలుపులు, యాక్షన్ సన్నివేశాలు, స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందించిన ఎపిసోడ్స్ ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా ఉంచుతాయి.
రామ్ చరణ్ నటన హైలైట్
ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించారు. గ్రామీణ యువకుడి పాత్రలో ఆయన నటన సహజంగా ఉండటమే కాకుండా, ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. పాత్ర కోసం ఆయన చేసిన శారీరక మార్పులు మరియు యాక్షన్ సన్నివేశాల్లో చూపిన ఎనర్జీ పెద్ది సినిమాకు ప్రధాన ఆకర్షణ మరియు బలంగా నిలిచాయి.
Also Read: ఆన్‌లైన్ లో ఆధార్ తో పాన్ కార్డు ఎలా లింక్ చేయాలి: పూర్తి స్టెప్ బై స్టెప్ గైడ్
ఇతర నటీనటులు
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రతి పాత్ర కథకు అవసరమైన బలాన్ని అందిస్తూ సినిమాను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాయి.
సాంకేతిక విభాగం
దర్శకుడు బుచ్చిబాబు సానా తన కథను భావోద్వేగాలతో పాటు కమర్షియల్ అంశాలను కూడా సమతుల్యంగా మిళితం చేశారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కథకు మరింత బలం చేకూర్చాయి. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ మరియు నిర్మాణ విలువలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
