iQOO Z11 : ప్రీమియం డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ ప్రకటించిన ఐకూ.!

HIGHLIGHTS

ఐకూ Z Series నుంచి కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది

iQOO Z11 ప్రీమియం డిజైన్ తో లాంచ్ కోసం సిద్ధం

ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ టీజర్ ఇమేజ్ తో టీజర్ విడుదల చేసింది

iQOO Z11 : రీసెంట్ గా ఐకూ జెడ్ సిరీస్ నుంచి iQOO Z11 Lite లాంచ్ చేసిన ఐకూ, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. అదే, ఐకూ జెడ్ 11 స్మార్ట ఫోన్ మరియు ఈ ఫోన్ చాలా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ టీజర్ ఇమేజ్ తో టీజర్ విడుదల చేసింది. ఈ ఫోన్ ను కూడా అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది.

iQOO Z11 : లాంచ్ డేట్

ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ ఆగస్టు 20వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు ఐకూ తెలిపింది. ఈ ఫోన్ ను ఫాస్టర్ మరియు స్మార్టర్ ఫోన్ గా అందిస్తున్నట్లు టీజర్ లో తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ద్వారా అందించి టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ వివరాలు అందించింది.

iQOO Z11 : టీజర్ విశేషాలు

ఈ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ మరియు కెమెరా వివరాలు తెలిసేలా చేసింది. ఈ ఫోన్ లో 3D కర్వుడ్ డిస్ప్లే ఉంది మరియు ఇది పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా మరియు ఆరా రింగ్ లైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో మెటల్ ఫ్రేమ్ మరియు కెమెరా బాం ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో కన్పిస్తోంది.

ఈ ఫోన్ ను AI సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఐకూ తెలిపింది. ఐకూ జెడ్ 11 ఫోన్ కీలక ఫీచర్స్ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ ను మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి.

Also Read : Boltt Ace మరియు Evo పేరుతో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన బోల్ట్

ఐకూ జెడ్ 11 : అంచనా ఫీచర్స్

ఐకూ జెడ్ 11 స్మార్ట్ ఫోన్ 6.8 అంగుళాల పరిమాణం కలిగిన 3D కర్వుడ్ AMOLED డిస్ప్లేని 1.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను MediaTek Dimensity లేటెస్ట్ చిప్ సెట్ జతగా 8GB మరియు 12GB ర్యామ్ తో లాంచ్ చేసే అవకాశం ఉంది.

కెమెరా వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరా జతగా 2MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఐకూ ఈ ఫోన్ లో కూడా ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న బిగ్ బ్యాటరీ అందించే అవకాశం ఉంటుంది. అంటే, 7,000mAh నుంచి 8,000mAh వరకు భారీ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి.

అయితే, ఈ ఫోన్ అఫీషియల్ ఫీచర్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా రివీల్ కాలేదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :