iQOO Z10 Lite: భారీ బ్యాటరీతో కొత్త ఫోన్ లాంచ్ ప్రకటించిన ఐకూ.!
ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
iQOO Z10 Lite కీలకమైన ఫీచర్స్ కూడా అందించింది
ఐకూ జెడ్ 10 లైట్ ఫోన్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఈ ఫోన్ ను తీసుకు వస్తుంది
iQOO Z10 Lite: ఐకూ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఐకూ బడ్జెట్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తోంది మరియు గత సంవత్సరం అందించిన ఐకూ జెడ్ 10 లైట్ ఫోన్ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఈ ఫోన్ ను తీసుకు వస్తుంది.ఇటీవల భారీ 7300 బ్యాటరీ తో ఐకూ జెడ్ 10 5జి ఫోన్ లాంచ్ చేసిన ఐకూ, ఇప్పుడు ఈ ఫోన్ లైట్ వెర్షన్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఐకూ స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా కంపెనీ కొన్ని కీలకమైన ఫీచర్స్ కూడా అందించింది.
SurveyiQOO Z10 Lite: లాంచ్ డేట్
ఐకూ జెడ్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ ను జూన్ 18వ తేదీ ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. ‘ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైన్మెంట్’ ట్యాగ్ లైన్ తో ఈ ఫోన్ గురించి టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ స్పెషల్ గా ఇండియాలో లాంచ్ చేస్తోంది మరియు దీని కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ పీజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా అందించింది.
iQOO Z10 Lite: ఫీచర్స్
ఐకూ జెడ్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు స్లీక్ డిజైన్ కలిగి ఉంటుందని అర్థం అవుతోంది. ఈ ఫోన్ ను స్కై బ్లూ కలర్ వేరియంట్ లో టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ కలర్ ను కంపెనీ వెల్లడించే వరకు క్లియర్ గా చెప్పలేము. ఈ ఫోన్ ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టింది.

ఐకూ జెడ్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ ను 6000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ కన్ఫర్మ్ చేసింది. అందుకే కాబోలు ఈ ఫోన్ ను ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైన్మెంట్ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ బడ్జెట్ 5G చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చు. ఐకూ జెడ్ 10 5జి స్మార్ట్ ఫోన్ ను కూడా భారీ 7300 బ్యాటరీ తో అందించి ఐకూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇదే సీరిస్ బడ్జెట్ ఫోన్ లో కూడా 6000 mAh బిగ్ బ్యాటరీ ఉన్నట్లు ప్రకటించింది.
Also Read: OnePlus Pad 3: భారీ ఫీచర్స్ తో ఇండియాలో విడుదలైన వన్ ప్లస్ కొత్త ప్యాడ్.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని కీలకమైన ఫీచర్స్ తో మళ్ళి కలుద్దాం.