ఇండియాలో మొట్ట మొదటి 5G స్మార్ట్ ఫోన్ లాంచ్

ఇండియాలో మొట్ట మొదటి 5G స్మార్ట్ ఫోన్ లాంచ్
HIGHLIGHTS

ఇండియాలో స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తో విడుదలకానున్న మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది.

 IQOO సంస్థ, ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ IQOO 3 ని ఇండియాలో లాంచ్ చెయ్యడానికి సిద్దమయ్యింది. ముందుగా, మంచి ప్రత్యేకతలతో స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు ఏకంగా పూర్తిగా హై ఎండ్ ఫీచర్లతో తన సరికొత్త ఫోన్ను ఇండియాలో విడుదల చేయడానికి డేట్ ను సెట్ చేసింది. ఈ IQOO 3 ను మోన్స్టర్ ఇన్ సైడ్ అని వర్ణించింది(క్యాప్షన్) మరియు ఫిబ్రవరి 25 వ తేది మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ చెయ్యడానికి సిద్దమయ్యింది. ఈ ఫోన్ కోసం flipkart ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది మరియు దీని ద్వారా ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్ల యొక్క వివరాలతో టీజ్ కూడా చేస్తోంది.    

ప్రస్తుతానికి, ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికి వస్తే, క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 855+ SoC ఇండియాలో హై ఎండ్ పర్ఫార్మింగ్ ప్రాసెసర్ గా నిలచింది. ఇక పైన ఆ మాట ఎక్కువకాలం నిలవక పోవచ్చు. ఎందుకంటే, ఈ IQOO 3 స్మార్ట్ ఫోన్ను క్వల్కామ్ యొక్క సరికొత్త హై ఎండ్ ప్రాసెసర్ అయినటువంటి Snapdragon 865 ప్రాసెసర్ తో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే గనుక నిజమైతే, ఇండియాలో స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తో విడుదలకానున్న మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది.

ఇక ఈ ప్రాసెసర్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఇది వేగంగా పనిచేయడమే కాకుండా, 5G ఎనేబుల్ తో వస్తుంది. కాబట్టి, ఇండియాలో మెట్టమొదటి 5G ఎనేబుల్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అవుతుంది. అయితే, ఇండియాలో ఇంకా 5G నెట్వర్కు లేనప్పటికీ ఇది వేగవంతమైన Wi-Fi స్పీడ్ మరియు నెట్వర్క్ బూస్టింగ్ వంటి విషయాలను చేస్తుంది.                                

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo