తగ్గిన iPhone 6, 5S, 6 ప్లస్ ప్రైసెస్

Updated on 10-Sep-2015

ఆపిల్ నిన్న లేటెస్ట్ మోడల్, 6S ను లాంచ్ చేసింది గ్లోబల్ గా. దీనితో పాటు 6S మోడల్ కూడా లాంచ్ అయ్యింది. వీటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో చూడగలరు.

అయితే ప్రతీ సంవత్సరం లానే ఈ సారి కూడా లేటెస్ట్ మోడల్ 6S రిలీజ్ అవ్వగానే ప్రివియస్ మోడల్స్ పై కంపెని కొన్ని మార్పులు చేసింది. ఇది ఈ రోజు నుండి ఎఫెక్ట్ కానుంది. ఇక నెమ్మదిగా ఒక్కక్క వెబ్ సైట్ ప్రైసేస్ తగ్గిస్తాయి.

ప్రివియస్ మోడల్స్ లో వచ్చిన మార్పులు..

1. ఐ ఫోన్ 5C మోడల్ సేల్ ఆపేసింది.

2. ఐ ఫోన్ 5S, 6 అండ్ 6 ప్లస్ మోడల్స్ లో ఇప్పటి వరకూ ఉన్న గోల్డ్ కలర్ ఆప్షన్ ను తీసేసింది. అంటే ఎవరైనా గోల్డ్ కలర్ ఐ ఫోన్ కొనే కోరికలో ఉంటే లేటెస్ట్ మరియు ఎక్కువ ధరకు లభ్యమవుతున్న ఐ ఫోన్ 6S మాత్రమే కొనగలరు.

6S అండ్ 6S ప్లస్ మొత్తం నాలుగు కలర్స్ లో వస్తున్నాయి. గోల్డ్, రోస్ గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే. అలాగే ఐ ఫోన్ 5S 6 అండ్ 6 ప్లస్ మోడల్స్ యొక్క ధరలు కూడా తగ్గాయి.

3. కాంట్రాక్ట్ లేకుండా 16gb ఐ ఫోన్ 5S సుమారు 30,000 రూ, ఐ ఫోన్ 6 మోడల్ 36,700 రూ ఐ ఫోన్ 6 ప్లస్ 43,000 రూ లకు అందుబాటులోకి రానున్నాయి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :