iPhone 15 vs iPhone 14: మేజర్ అప్గ్రేడ్ మరియు New Tech ఫీచర్స్ తీసుకోండి| Tech New

iPhone 15 vs iPhone 14: మేజర్ అప్గ్రేడ్ మరియు New Tech ఫీచర్స్ తీసుకోండి| Tech New
HIGHLIGHTS

iPhone 15 Series బేసిక్ వేరియంట్ iPhone 15 మేజర్ అప్గ్రేడ్ మరియు New tech ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

iPhone 14 మరియు iPhone 15 మధ్య ఉన్న వ్యత్యాసాలు

iPhone 15 vs iPhone 14 వ్యత్యాసాలు మరియు ధర వివరాలతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్

iPhone 15 vs iPhone 14: iPhone 15 Series ఇప్పుడు భారత్ తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అఫీషియల్ గా లాంచ్ అయ్యాయి. iPhone 15 Series బేసిక్ వేరియంట్ iPhone 15 మేజర్ అప్గ్రేడ్ మరియు New tech ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. గత సంవత్సరం యాపిల్ తీసుకొచ్చిన iPhone 14 మరియు iPhone 15 మధ్య ఉన్న వ్యత్యాసాలు మరియు ధర వివరాలతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.  

iPhone 15 Price 

1. iPhone 15  (128GB) Price : Rs. 79,900 

2. iPhone 15  (256GB) Price : Rs. 89,900

3. iPhone 15  (512 GB) Price : Rs. 109,900

iPhone 14 New Price

1. iPhone 15  (128GB) Price : Rs. 69,900 

2. iPhone 15  (256GB) Price : Rs. 79,900

3. iPhone 15  (512 GB) Price : Rs. 99,900

iPhone 15 Availability 

iPhone 15 ఫోన్ యొక్క Pre-orders 15 September సాయంత్రం 5:30 PM నుండి మొదలవుతుంది మరియు ఐఫోన్ 15 ఫోన్స్ September 22 వ తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ 14 ఫోన్లు కొత్త రేట్ లతో సేల్ అవుతున్నాయి.          

iPhone 15 vs iPhone 14 colours

iphone 15 ఫోన్ 5 కలర్ ఎంపికలో లభిస్తున్నాయి. అవి: Blue, Pink, Yellow, Green మరియు Black

iphone 14 ఫోన్ 6 కలర్ అప్షన్ లలో లభిస్తుంది. అవి: Blue, Purple, Yellow, Midnight, Starlight మరియు RED

iPhone 15 vs iPhone 14: Display  

ఐఫోన్ 15 ఫోన్ కలర్ ఇన్ఫ్యూజ్డ్ గ్లాస్ బ్యాక్ మరియు Aluminium ఫ్రేమ్ తో వస్తుంది.  అయితే, ఐఫోన్ 14 మాత్రం Aluminium with glass back తో మాత్రమే ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా 6.1 ఇంచ్ Super Retina XDR (OLED) డిస్ప్లేతో వస్తాయి. అయితే, యాపిల్ ఐఫోన్ 14 కంటే ఐఫోన్ 15 అప్గ్రేడ్ ఫీచర్ తో వస్తుంది. అదేమిటంటే, గత Apple తీసుకొచ్చిన Dynamic Island ఫీచర్ ను ఈసారి 15 సిరీస్ బేసిక్ వేరియంట్ iPhone 15 లో కూడా జత చేసింది. ఇది ఈ రెండు ఫోన్లను డిస్ప్లే పరంగా వేరు చేస్తుంది మరియు iPhone 15 ను ఒక స్టెప్ పైన నిలబడుతుంది.

అలాగే, ఐఫోన్ 14 కేవలం 800 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తే ఐఫోన్ 15 ఫోన్ మాత్రం 2,000 nits పీక్ బ్రైట్నెస్ తో వచ్చింది.         

iPhone 15 vs iPhone 14 Processor 

ఐఫోన్ 15 ఫోన్ 5-core GPU తో కూడిన A16 Bionic chip తో పని చేస్తుంది. అయితే, ఐఫోన్ 14 మాత్రం A15 Bionic chip తో పని చేస్తుంది. ఈ పెర్ఫార్మన్స్ విషయంలో కూడా ఐఫోన్ 15 ఫోన్ దే పై చెయ్యి అవుతుంది. 

iPhone 15 vs iPhone 14 camera

iPhone 15 vs iPhone 14 Camera  

iPhone 15 vs iPhone 14 Camera విషయానికి వస్తే, ఈ విభాగంలో ఐఫోన్ 15 ఖచ్చితంగా విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే, ఐఫోన్ 15 ఫోన్ లో మంచి అప్గ్రేడ్ నే అందించింది యాపిల్. ఐఫోన్ 15 ఫోన్ 48MP Main మరియు 12MP Ultra Wide సెన్సార్ లను కలిగిన డ్యూయల్ కేమెరా సెటప్ తో వచ్చింది. ఈ ఫోన్ కెమేరా Focus and Depth కంట్రోల్స్ తో గొప్ప Hi-res ఫోటోలను తియ్యగలదని 2x optical zoom అప్షన్ తో కూడా ఉంటుంది. 

అయితే, iPhone 14 లో మాత్రం 12MP Main మరియు 12MP Ultra Wide సెన్సార్ లను కలిగిన డ్యూయల్ కేమెరా సెటప్ వుంది. ఈ కెమేరాతో 1x optical zoom అప్షన్ మాత్రమే వుంది.       
 
ఈ రెండు ఐఫోన్ కెమేరాతో కూడా 4K video recording ను 60fps వరకూ రికార్డ్ చేసే వీలుంది. అలాగే, Cinematic mode లో 4K HDR వీడియోలను 30 fps వద్ద చిత్రీకరించవచ్చు.

అయితే, ఐఫోన్ 14 లో ఫోటోల కోసం Smart HDR 4 ఉంటే Smart HDR 5 తో వస్తుంది. అంటే, ఫోటోలు మరింత గొప్పగా ఉంటాయి. 

iPhone 15 vs iPhone 14 Safety

ఈ రెండు ఐఫోన్ లో కూడా అత్యవసర సమయంలో ఉపయోగకరమైన Crash Detection Emergency SOS ఫీచర్ వుంది. 

iPhone 15 vs iPhone 14 other features 

iPhone 15 ఫోన్ లో అభిమానుల కోరిక మేరకు USB‑C ఛార్జ్ పోర్ట్ సపోర్ట్ ను Apple అందించింది. ఐఫోన్ 14 మాత్రం ఆపిల్ Lightning ఛార్జ్ పోర్ట్ తో వస్తుంది.  

ఈ రెండు ఐఫోన్ లు కూడా IP68 Rated తో Splash, Water మరియు Dust Resistant గా ఉంటాయి.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo