Sailfish OS తో android store సపోర్ట్ తో 2GB రామ్ కలిగిన కొత్త ఫోన్

Sailfish OS తో android store సపోర్ట్ తో 2GB రామ్ కలిగిన కొత్త ఫోన్

ఇంటెక్స్ కంపెనీ విభిన్నంగా Sailfish OS అనే మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తో మార్కెట్ లో Aqua Fish అనే స్మార్ట్ ఫోన్ మోడల్ ను లాంచ్ చేసింది.

అంటే ఇది android OS పై రన్ అవ్వదు. ప్రైస్  - 5,499 రూ. ebay సైట్  సేల్స్ అవుతుంది ప్రస్తుతం. తొందరలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్, snapdeal పై కూడా సెల్ అవుతుంది.

స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో 5 in HD IPS డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 2GB రామ్, 16GB  ఇంబిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. దీనిలో రన్ అయ్యే Sailfish OS 2.0 వెర్షన్ తో వస్తుంది.

32GB SD కార్డు సపోర్ట్ కూడా ఉన్న ఈ హాండ్ సెట్ వేరే OS పై పనిచేస్తున్నా, android అప్లికేషన్ సపోర్ట్ ఉంటుంది. Sailfish OS లో జస్ట్ swipes తో ఆపరేట్ చేసుకోగలరు యూజర్ ఇంటర్ఫేస్ ను. సింగిల్ హ్యాండ్ usage కు బాగుంటుంది.

2500mah బ్యాటరీ, 8MP రేర్ LED ఫ్లాష్  కెమెరా అండ్ 2MP front కెమెరా, android యాప్ store తో 150 గ్రా బరువు కలిగిన ఈ ఫోన్ ఆరంజ్ కలర్ లో వస్తుంది.

PJ Hari

PJ Hari

PJ Hari Gadget Geek. Movie Buff. Non fiction Books

View full profile