Infinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్ 180W ఫాస్ట్ ఛార్జింగ్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

infinix మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్ధమయ్యింది

nfinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కి సిద్ధం

180W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి భారీ ప్రత్యేకతలతో వస్తోంది

Infinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్ 180W ఫాస్ట్ ఛార్జింగ్ తో లాంచ్ అవుతోంది.!

ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ సంస్థ infinix మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్ధమయ్యింది. అదే, Infinix Zero Ultra 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ రెండు నెలల క్రితమే చైనాలో లాంచ్ చెయ్యబడింది. భారీ 200MP OIS కెమెరా మరియు 180W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి భారీ ప్రత్యేకతలను కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో ఆకర్షణీయమైన ధరలో విడుదల చేయనున్నట్లు Flipkart ద్వారా కంపెనీ టీజింగ్ చేస్తోంది. డిసెంబర్ 20 న ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అవుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix Zero Ultra 5G చైనా వేరియంట్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను క్రింద చూడవచ్చు. 

Infinix Zero Ultra 5G: ఫీచర్లు (చైనా వేరియంట్)

ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 ఇంచ్ 3D AMOLED డిస్ప్లేతో వచ్చింది మరియు ఇది FHD+ డిస్ప్లేని సెంటర్ పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, గేమింగ్ మరియు స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ Dimensity 920 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ను కూడా కలిగివుంది.

ఆప్టిక్స్ పరంగా, జీరో అల్ట్రా 5G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 200MP మైన్ కెమెరాకి జతగా అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే, ముందు పంచ్ హోల్ కటౌట్ లో 32 ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో 4610 mAh బ్యాటరీని 180W థండర్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది మరియు ఈ ఫోన్ కేవలం 12 నిముషాల్లోనే 0 నుండి 100% ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా XOS 12 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo