Infinix SMART 8 HD: ఆకర్షణీయమైన ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది.!

HIGHLIGHTS

Infinix SMART 8 HD స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది

Infinix SMART 8 HD ఆకర్షణీయమైన ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది

ఈ ఫోన్ సెల్ఫీ కెమేరా చుట్టూ ఒక రింగ్ నోటిఫికేషన్ బార్ వుంది

Infinix SMART 8 HD: ఆకర్షణీయమైన ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది.!

ఇన్ఫినిక్స్ చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న Infinix SMART 8 HD స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD స్మార్ట్ ఫోన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది. ఈ ఫోన్ ఈ బడ్జెట్ కేటగిరిలో ఇతర ఫోన్లు కలిగి లేని ఒక ప్రత్యేకమైన ఫీచర్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix SMART 8 HD Price

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD స్మార్ట్ ఫోన్ నుం కేవలం రూ. 6,299 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ఫోన్ ను Axis Bank క్రెడిట్ & డెబిట్ కార్డ్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ ను అందిస్తుంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా ఈ ఫోన్ మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read : WhatsApp LIC Service: వాట్సాప్ ద్వారా సింపుల్ గా అన్ని సర్వీస్ లు అందుకోండి.!

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ప్రత్యేకతలు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ HD+ IPS డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 3GB RAM మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది. మెమొరీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ మెమోరీని 1TB వరకూ పెంచుకునే అవకాశం కూడా వుంది.

Infinix SMART 8 HD features
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ఫోన్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 HD ఫోన్ లో వెనుక 13MP + AI Lens డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. అలాగే, స్మార్ట్ 6 HD ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమేరా చుట్టూ ఒక రింగ్ నోటిఫికేషన్ బార్ వుంది. ఈ ఫీచర్ ని Magic Ring గా పిలుస్తోంది ఇన్ఫినిక్స్. ఈ ఫీచర్ చూడటానికి ఐఫోన్ లేటెస్ట్ ప్రీమియం ఫోన్ లలో ఉండే డైనమిక్ ఐల్యాండ్ మాదిరిగా కనిపిస్తుంది.

ఈ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని రెగ్యులర్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo