Infinix Smart 6: కేవలం రూ.7,499 ధరలో 64GB స్టోరేజ్ తో వచ్చింది..!!

Infinix Smart 6: కేవలం రూ.7,499 ధరలో 64GB స్టోరేజ్ తో వచ్చింది..!!
HIGHLIGHTS

ఈరోజు ఇండియాలో మరొక ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది

Infinix Smart 6 తక్కువ ధరలో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది

పెద్ద డిస్ప్లే, ఎక్కువ ఇన్ బిల్ట్ స్టోరేజ్, వర్చువల్

ఈరోజు ఇండియాలో మరొక ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. అదే, Infinix Smart 6 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ కేవలం 8 వేల కంటే తక్కువ ధరలో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. అయితే, కొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద డిస్ప్లే, ఎక్కువ ఇన్ బిల్ట్ స్టోరేజ్, వర్చువల్ ర్యామ్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ప్రత్యేకతలను కలిగివుంటుంది. ప్రస్తుతం మర్కెట్లో వున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీగా ఇన్ఫినిక్స్ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి సవివరంగా తెలుసుకుందాం.

Infinix Smart 6: ధర మరియు సేల్

మే 6వ తేదీ నుండి ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా అమ్మకానికి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ.7,499. ఈ స్మార్ట్ ఫోన్ హార్ ఆఫ్ ఓషియన్, పోలార్ బ్లాక్ మరియు స్టారి  పర్పల్ బ్లాక్ అనే మూడు రంగులలో వస్తుంది.

Infinix Smart 6: డిస్ప్లే

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక పెద్ద 6.6 ”HD + డ్రాప్ నాచ్ డిస్ప్లే మరియు 88.4% స్క్రీన్ టు బాడీ రేషియోతో 500 నిట్స్  బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది టీవీ షోలను చూడటానికి మంచి ఎంపికగా వుంటుంది, సినిమాలు, మ్యూజిక్ వీడియోలు లేదా ఎలాంటి వినోదం కార్యక్రమాలనైనా చక్కగా ఆస్వాదించవచ్చు మరియు నాలుగు మోడ్‌ లలో శక్తివంతమైన ఆడియో అనుభవంతో మీ వ్యూవింగ్ అనుభవాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది.

Infinix SMART 6_5.jpg

Infinix Smart 6: కెమేరా

ఈ స్మార్ట్ 6 బడ్జెట్ స్మార్ట్ ‌ఫోన్  ఈ విభాగంలో మంచి ఫోటోలను అందించే కెమెరాతో రూపొందించబడింది. ఇది 8MP AI డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది, ఇది డ్యూయల్ LED ఫ్లాష్‌ తో పాటు f / 2.0 ఎపర్చర్‌ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోనులో ఎఫ్ / 2.0 ఎపర్చరుతో 5MP సెల్ఫీ కెమెరా, AI HDR, బ్యూటీ మోడ్ మరియు  పోర్ట్రెయిట్ మరియు వైడ్ సెల్ఫీ వంటి మల్టి కెమెరా మోడ్లు ఉన్నాయి.

Infinix Smart 6: బ్యాటరీ

లేటెస్ట్ గా వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్ ఈ విభాగంలో అత్యాధునిక ఫీచర్లతో నిండి ఉంది. ఇది కేవలం 8 వేల ధర విభాగంలో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పాటు పవర్ మారథాన్ టెక్ తో వస్తుంది. ఈ పెద్ద బ్యాటరీ, 60 రోజుల స్టాండ్‌బై టైం , 20 గంటల నాన్ ‌స్టాప్ వీడియో ప్లే బ్యాక్, 54 గంటల 4G టాక్‌టైమ్, 153 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ ను అందిస్తుంది.

Infinix Smart 6: పర్ఫార్మెన్స్ , స్టోరేజ్ మరియు డిజైన్

2 జిబి ర్యామ్ మరియు 2GB వర్చువల్ ర్యామ్ / 64 జిబి స్టోరేజ్ ‌తో హీలియో A 22 ఆక్టా కోర్ ప్రాసెసర్ ‌శక్తితో పనిచేసే ఈ సరికొత్త స్మార్ట్ 6 స్మార్ట్ ‌ఫోన్ ఆండ్రాయిడ్ XOS 7.6 సాఫ్ట్ వేర్ పైన ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది. ఇది 512GB వరకు మెమరీని పెంచడానికి ప్రత్యేకమైన 3-ఇన్ -1 SD కార్డ్ స్లాట్‌ తో వస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ మెటీరియాల్ డిజైన్ తో వస్తుంది. అదనంగా, ఈ చిప్ ‌సెట్ అధునాతన స్మార్ట్ ‌ఫోన్ ఫీచర్లైన ఫింగర్ ప్రింట్ / ఫేస్ అన్‌లాక్ ను కలిగి వుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo