Infinix Note 50s: బడ్జెట్ ధరలో కంప్లీట్ ఫీచర్స్ తో వచ్చిన కొత్త ఫోన్ సేల్ మొదలయ్యింది.!
Infinix Note 50s ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది
ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో కంప్లీట్ ఫీచర్స్ తో వచ్చినట్లు కంపెనీ తెలిపింది
ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఆఫర్ తో కేవలం రూ. 14,999 రూపాయల ధరకే లభిస్తుంది
Infinix Note 50s: ఇన్ఫినిక్స్ సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50s ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో కంప్లీట్ ఫీచర్స్ తో వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్, కర్వుడ్ స్క్రీన్ మరియు 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన Sony కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
SurveyInfinix Note 50s: ప్రైస్
ఇన్ఫినిక్స్ నోట్ 50s స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 15,999 ధరలో మరియు (8GB + 256GB) వేరియంట్ ను రూ. 17,999 ధరలో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఆఫర్ తో కేవలం రూ. 14,999 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఒక ఆఫర్ ను మాత్రమే అందుకునే అవకాశం వుంది.
Infinix Note 50s: ఫీచర్స్
ఇన్ఫినిక్స్ నోట్ 50s స్మార్ట్ ఫోన్ చాలా సన్నని డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ 6.78 ఇంచ్ 3D Curved AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 మరియు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Ultimate చిప్ సెట్, 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టం కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 64MP Sony IMX 682 మెయిన్ కెమెరా + 2MP కెమెరా కలిగి ఉంటుంది మరియు ఫోన్ ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో AIGC పోర్ట్రైట్, డ్యూయల్ వీడియో, స్లో మోషన్ మరియు సూపర్ నైట్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: బిగ్ డీల్: కేవలం 50 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart TV అందుకోండి.!
ఈ ఫోన్ MIL-810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికెట్, 8GB వర్చువల్ RAM, IP64 రేటింగ్, IR Blaster, యాక్టివ్ హేలో లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది. ఈ ఫోన్ లో 10W రివర్స్ ఛార్జ్ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.