108MP కెమెరాతో వస్తున్నInfinix Note 12 5G స్మార్ట్ ఫోన్..!!

HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Infinix Note 12 5G

ఇన్ఫినిక్స్ నోట్ 12 5G ఫోన్ ను జూలై 8న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ను భారీ 108MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సిస్టంతో తీసుకువస్తోంది

108MP కెమెరాతో వస్తున్నInfinix Note 12 5G స్మార్ట్ ఫోన్..!!

ఇన్ఫినిక్స్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్  Infinix Note 12 5G యొక్క లాంచ్ డేట్ ప్రకటించింది. ఇన్ఫినిక్స్ నోట్ 12 5G స్మార్ట్ ఫోన్ ను జూలై 8వ తేదీ లంచ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసింది. అంతేకాదు, Infinix Note 12 5G కోసం Flipkart ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ 108MP సూపర్ నైట్ కెమెరా మరియు బిగ్ AMOLED డిస్ప్లే తో తీసుకువస్తున్నట్లు కంపెనీ టీజింగ్ కూడా స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ నుండి మనం ఏమి ఆశించవచ్చని ఈరోజు చూద్దాం.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix Note 12 5G స్మార్ట్ ఫోన్  యొక్క కెమెరా వివరాలను కంపెనీ హైలెట్ చేసి చూపించింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను భారీ 108MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సిస్టంతో చూపిస్తోంది. అంతేకాదు, ఈ పేజ్ ద్వారా అందించిన ఇమేజ్ ల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ AMOLED డిస్ప్లేని, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ మరియు ప్రైమరీ మైక్రో ఫోన్‌ లను కూడా మనం చూడవచ్చు. అలాగే, వెనుక వైపున పెద్ద బంప్ లో LED ఫ్లాష్ తో జత చేసిన 108MP కెమెరా సెటప్ చూడవచ్చు. ఈ కెమెరా f/1.75 అపర్చర్/24mm ASPH ని కూడా చూపిస్తోంది.

Infinix Note 12 5G స్మార్ట్ ఫోన్ నుండి మనం ఏమి ఆశించవచ్చు అని చూస్తే, ఈ ఫోన్ 6.5-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో రావచ్చు. అలాగే, మిడ్ సెగ్మెంట్ 5G ప్రాసెసర్ MediaTek డైమెన్సిటీ 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తి వస్తుంది. ఈ ఫోన్ కనీసం 8GB RAM మరియు కనీసం 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడవచ్చు. ముందు భాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. Infinix Note 12 5G ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో రావచ్చని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo