చవక ధరలో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు AMOLED డిస్ప్లేతో వచ్చిన Infinix Note 11 స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ infinix కేవలం బడ్జెట్ ధరలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు AMOLED డిస్ప్లేతో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Infinix Note 11 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ కేవలం రూ.11,999 రుపాయల ధరలో ఆకట్టుకునే భారీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా మంచి స్టైలిష్ డిజైన్ తో కూడా లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకుందాం.
SurveyInfinix Note 11 : ధర
Infinix Note 11 స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ తో రూ.11,999 ధరతో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 23 మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి జరుగుతుంది.
Infinix Note 11 : స్పెక్స్
Infinix Note 11 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7-అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది గరిష్టంగా 750 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో G88 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. అలాగే, ఇది XOS 10 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.
ఇక కెమెరాల విషయంలో, ఈ ఇన్ఫినిక్స్ నోట్ 11 వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 50MP సెన్సార్ తో అందించింది. దీనికి మరొక రెండు సెన్సార్ లను మరియు క్వాడ్ LED ఫ్లాష్ ను కూడా జతచేసింది. ముందు భాగంలో, 16MP AI సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.