Infinix GT 30 Pro 5G: OG గేమింగ్ ఫోన్ లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!
Infinix GT 30 Pro 5G లాంచ్ అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ గేమింగ్ ప్రత్యేకమైన ఫోన్ గా వస్తోంది
డిజైన్ మొదలుకొని ఫీచర్స్ వరకు అన్ని కూడా ప్రో గేమర్స్ కోసమే అన్నట్లు ఉన్నాయి
Infinix GT 30 Pro 5G: ఇండియాలో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న మొబైల్ తయారీ కంపెనీ గా పేరొందిన చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ లాంచ్ ప్రకటించింది. అదే, ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ గేమింగ్ ప్రత్యేకమైన ఫోన్ గా వస్తోంది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని ఫీచర్స్ వరకు అన్ని కూడా ప్రో గేమర్స్ కోసమే అన్నట్లు ఉన్నాయి.
Infinix GT 30 Pro 5G: ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ అనగా, జూన్ 3వ తేదీ మార్కెట్లో విడుదల అవుతుంది. ఈ ఫోన్ కూడా ఫ్లిప్ కార్ట్ నుంచి టీజింగ్ అవుతోంది మరియు ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో కంపెనీ టీజింగ్ చేస్తోంది.
Infinix GT 30 Pro 5G: ఫీచర్స్
ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను గేమింగ్ కోసం ప్రత్యేకమైన డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో గేమింగ్ కన్సోల్ లెవెల్ కంట్రోల్స్ GT Trigger తో అందిస్తోంది. ఇది షోల్డర్ ట్రిగర్ కలిగిన సెగ్మెంట్ ఫస్ట్ ఫోన్ గా వస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ ట్రిగర్స్ ను యూజర్ కు తగిన విధంగా గేమింగ్ లేదా కెమెరా లేదా మీడియా ప్లే బ్యాక్ వంటి వాటికీ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ లో మెకానికల్ లైట్ వేవ్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఏకంగా 10 కస్టమైజబుల్ LED లైటింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.
ఇది BGMI 120FPS Esports సపోర్ట్ తో వస్తుంది మరియు OG Gaming అందిస్తుంది. ఇది Kafton నుంచి 120FPS సర్టిఫైడ్ అయిన మొబైల్ అని ఇన్ఫినిక్స్ చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ఇందులో 108MP ప్రధాన సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి. ఈ ఫోన్ డార్క్ ఫ్లేర్ మరియు బ్లేడ్ వైట్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది.
Also Read: Lava Shark 5G : అతి చవక ధరలో స్టన్నింగ్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన లావా.!
ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్స్ మాత్రమే ఇన్ఫినిక్స్ వెల్లడించింది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా త్వరలోనే వెల్లడిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న గేమింగ్ ట్రెండ్ కి తగిన అన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.