Lava Shark 5G: లావా మొబైల్స్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో అతి చవక ధరలో స్టన్నింగ్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈరోజు లావా విడుదల చేసిన Lava Bold N1 మరియు Bold N1 Pro బడ్జెట్ 4G ఫోన్ లతో పాటు ఈ ఫోన్ ను కూడా లాంచ్ చేసింది. అదే, లావా షార్క్ 5జి మరియు ఈ ఫోన్ ను స్లీక్ డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. అండర్ రూ. 8,000 బడ్జెట్ యూజర్ ను లక్ష్యంగా చేసుకొని ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Lava Shark 5G : ప్రైస్
లావా షార్క్ 5జి స్మార్ట్ ఫోన్ ను 4GB + 64GB సింగల్ వేరియంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 7,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి లావా మొబైల్స్ అధికారిక వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. లావా షార్క్ 5జి స్మార్ట్ ఫోన్ స్టెల్లార్ గోల్డ్ మరియు స్టెల్లార్ బ్లూ రెండు అందమైన కలర్ లలో లభిస్తుంది.
లావా షార్క్ 5జి స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ HD Plus స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 2.5D గ్లాస్ తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 8.2mm మందంతో సన్నగా మరియు 200gm బరువుతో చాలా తేలికగా ఉంటుంది. లావా షార్క్ స్మార్ట్ ఫోన్ Unisoc T765 ఆక్టా కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 5G చిప్ సెట్ మరియు 400K కు పైగా AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ 4GB ఫిజికల్ ర్యామ్ మరియు 4GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో పాటు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ లావా లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు బ్లోట్ వేర్ బెదడ లేని Android 15 తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది మరియు సాధారణ 10W ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో వస్తుంది మరియు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.