HIGHLIGHTS
Infinix నుండి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్
Infinix Smart HD 2021 స్మార్ట్ ఫోన్
XOS 6.2 స్కిన్ పైన ఆండ్రాయిడ్ GO ఎడిషన్ పైన పనిచేస్తుంది.
ఇంఫినిక్స్ సంస్థ ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ Infinix Smart HD 2021 ని లాంచ్ చేసింది. ఇంఫినిక్స్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ మరియు పెద్ద స్క్రీన్ తో పాటుగా మీడియాటెక్ యొక్క ఆక్టా కోర్ ప్రొసెసర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి డిసెంబర్ 24 నుండి అమ్మకాలను కొనసాగించనుంది. ఈ ఫోన్ గురించి అన్ని వివరాలను గురించి చూద్దాం..
SurveyInfinix నుండి వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.1 అంగుళాల HD+ డిస్ప్లేని కలిగివుంటుంది. ఫోనులో ఎక్కువ భాగం స్క్రీన్ అందించే విధంగా 19.5:9 ఎస్పెక్టు రేషియాతో వస్తుంది. Infinix Smart HD 2021 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో A20 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 2GB తో జతచేయబడింది. ఈ ఫోను 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అయితే, SD కార్డు సహాయంతో 256GB వరకూ మెమొరీని పెంచుకోవచ్చు.
Infinix Smart HD 2021 స్మార్ట్ ఫోన్ కెమెరా పరంగా వెనుక కేవలం 8MP సింగిల్ కెమెరాని డ్యూయల్ LED ఫ్లాష్ తో కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ముందు 5MP సెల్ఫీ కెమెరాని ఫ్లాష్ తో కలిగివుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తనలో 5000 mAh పెద్ద బ్యాటరీని కూడా ఇముడ్చుకుంది మరియు మైక్రో USB తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ సంస్థ యొక్క సొంత సిస్టమ్ అయిన XOS 6.2 స్కిన్ పైన ఆండ్రాయిడ్ GO ఎడిషన్ పైన పనిచేస్తుంది.