Infinix GT 50 Pro launched with hydro flow liquid cooling system
Infinix GT 50 Pro: ఇన్ఫినిక్స్ తాన్ ఆల్ టైమ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసింది. అదే, ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ NX కంట్రోలర్, NX స్టేషన్ మరియు మెగా ఛార్జ్ కూలర్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.
ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్ ఫోన్ ను 12 జీబీ + 256 జీబీ సింగల్ వేరియంట్ తో రూ. 69,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ అబిస్ మరియు రెడ్ బ్లేజ్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ని ఈరోజు నుంచి ప్రారంభించింది. అయితే, అక్టోబర్ 30 నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది.
ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా ఈ ఫోన్ పైన గొప్ప డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 5,000 రూపాయల భారీ HDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అనౌన్స్ చేసింది. ఈ లాంచ్ ఆఫర్ తో ఈ ఫోన్ మీకు రూ. 64,999 ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: కేవలం 6 వేల ఆఫర్ ధరకే 200 ఇంచ్ HDR 10 Projector మీ సొంతం చేసుకోండి.!
ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ ని గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8400 Ultimate ప్రాసెసర్ తో అందించింది. ఇది 2.2 మిలియన్ AnTuTu స్కోర్ అందించే ప్రాసెసర్ మరియు ఏఐ పవర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో 60FPS 4K వీడియో సపోర్ట్ కలిగిన 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గేమింగ్ కోసం ప్రత్యేకమైన GT ట్రిగ్గర్స్ మరియు ఫోన్ తో అటాచ్ చేసే ప్రత్యేకమైన GT కంట్రోలర్ మరియు GT మెగా చార్జర్ కూలర్ కూడా అందిస్తుంది.
Also Read: 8.1 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ పండుగ ఆఫర్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
ఈ కొత్త ఫోన్ ను సైబర్ మెకా డిజైన్ తో అందించింది. ఈ డిజైన్ తో ఈ ఫోన్ చాలా గొప్ప లుక్స్ తో ఉంటుంది. ఈ ఫోన్ ని వేగంగా కూల్ చేయడానికి వీలుగా ఈ ఫోన్ లో హైడ్రో ఫ్లో లిక్విడ్ కూలింగ్ సిస్టం కూడా అందించింది. ఇక ఈ ఫోన్ ను నడిపించడానికి వీలుగా 6500 mAh బిగ్ బ్యాటరీని అందించింది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 30W వైర్లెస్ ఛార్జ్ తో పాటు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా అందించింది. మంచి ఆడియో కోసం ఈ ఫోన్ లో డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ కూడా అందించింది.