indian wearable and audio products brand Fire Boltt set entry to mobile market
Fire Boltt Phone: మొబైల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఇండియా ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్. ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ ఇప్పుడు మొబైల్ ఫోన్ తయారీ లోకి అడుగుపెట్టింది. బడ్జెట్ ధరలో మంచి వేరబుల్ మరియు ఆడియో ప్రొడక్ట్స్ అందించిన ఈ కంపెనీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజర్ అందించింది.
ఫైర్ బోల్ట్ కొత్తగా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినట్టు తెలిపింది. ఇండియాలో కొత్త స్మార్ట్ లాంచ్ గురించి ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ కూడా మొదలు పెట్టింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా వెల్లడించలేదు.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి కేవలం టీజింగ్ మాత్రమే ఫైర్ బోల్ట్ అందించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఎటువంటి వివరాలు కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, టీజర్ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫైర్ బోల్ట్ స్మార్ట్ ఫోన్ సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్ తో లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ అయ్యింది.
టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టే విషయం గురించి ఒక నోట్ అందించింది. అదేమిటంటే, “ఇప్పటి వరకు అందించిన ప్రొడక్ట్స్ తో ఇప్పటికే వినియోగదారుల మెప్పు పొందిన మేము ఇప్పుడు అదే కమిట్‌మెంట్ తో స్మార్ట్ ఫోన్ ను అందించే దిశగా మీ కోసం వస్తున్నాం” అని తెలిపింది.
స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్, హెడ్ ఫాన్స్ మరియు మరిన్ని ఇతర ప్రొడక్ట్స్ ను బడ్జెట్ ధరలో అందించిన కంపెనీగా ఫైర్ బోల్ట్ ఇండియన్ యూజర్ నుంచి మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా అదే బడ్జెట్ మంత్రాన్ని జపించే అవకాశం ఉంటుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, రూ. 10,000 నుంచి రూ. 15,000 రూపాయల సెగ్మెంట్ బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేస్తూ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి అఫీషియల్ వివరాలు బయటకు రాలేదు, కాబట్టి, ఈ ఫోన్ విశేషాలు తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి.