Huawei మేట్ 20 ప్రో, మేట్ 20, మేట్ 20 X మరియు పర్చే డిజైన్ మేట్ 20 RS స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది

Huawei మేట్ 20 ప్రో, మేట్ 20, మేట్ 20 X మరియు పర్చే డిజైన్ మేట్ 20 RS స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది
HIGHLIGHTS

ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్, 7nm కిరిణ్ 980 SoC ఫీచర్లుగా గల హువేయి యొక్క మేట్ 20 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదలచేసింది.

నెలరోజుల దీర్ఘ టీజింగులు, లీకులు మరియు నివేదికల తరువాత, హువేయి యొక్క మేట్ 20 సిరీస్ స్మార్ట్ ఫోన్లను అధికారికంగా విడుదలచేసింది. ఈ కంపెనీ,హువేయి మేట్ 20 ప్రో, ది మేట్ 20, మేట్ 20 X మరియు మేట్ 20 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. కొత్తగా వచ్చిన ఈ అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా తాజా హైసిలికాన్ కిరిణ్ 980SoC తో నడుస్తాయి, మరియు ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తాయి. ఈ ఫోన్లు డ్యూయల్ – NPU, Leica వైడ్ యాంగిల్ లెన్స్ తో కూడిన Leica ట్రిపుల్ కెమేరా మరియు 40వాట్స్ తో ఛార్జ్ చేయగల హువేయి సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటాయి. ఈ నాలుగు మేట్ 20 సిరీస్ స్మార్ట్ ఫోన్లన్నింటిలో కూడా,  మేట్ 20X ఒక పెద్ద డిస్ప్లే మరియు హువేయి యొక్క M- పెన్ స్టయిలస్ తో వస్తుంది.

హువేయి మేట్ 20 మరియు హువేయి మేట్ 20 ప్రో ప్రత్యేకతలు

ఈ హువేయి మేట్ 20 18.7:9 యాస్పెక్ట్ రేషియో మరియు 820 నిట్స్ బ్రైట్నెస్ అందించగల ఒక 6.53 అంగుళాల Full HD+ RGWB HDR డిస్ప్లే ని కలిగి ఉంటుంది. అలాగే, ఈ మేట్ 20 ప్రో 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన ఒక 6.39 అంగుళాల 2K+ కర్వ్డ్ OLED HDR డిస్ప్లేని కలిగివుంటుంది. అయితే, ఈ మేట్ 20 వాటర్ డ్రాప్ నోచ్ తో ఉంటే, మేట్ 20 ప్రో మాత్రం నోచ్ లో కెమేరా మరియు మంచి పేస్ అన్లాక్ పనితీరుకు సెన్సర్లను కలిగి, సాధారణ నాచ్ తో వస్తుంది.

ఈ రెండు ఫోన్లు కూడా, చేతిలో పట్టుకోవాడిని సరిపోయేలా గుండ్రని మూలాలు కలిగి ఉంటాయి. ఈ మేట్ 20 ప్రో మంచి ఫింగర్ ప్రింట్ లక్షణం కోసం, డైనమిక్ ప్రెజర్ సెన్సింగ్ తో పనిచేసే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని డిస్ప్లే లో కలిగి ఉంటుంది. ప్రస్తుతం వాడుకలోవున్నాఇన్ – బిల్డ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్  ఫోన్ల కంటే 30 శాతం అధిక వేగంతో ఈ ఫోన్ అన్లాక్ పనితీరు ఉంటుంది తెలిపారు. ఈ కంపెనీ  ఈ ఫోన్లో కొత్త నానో మైక్రో (NM) కార్డు ని పరిచేయం చేస్తుంది. ఇది ప్రస్తుతం, అధిక వాడుకలోవున్న  మైక్రో SD కారు కంటే 45 శాతం చిన్నగా ఉంటుంది. ఈ కొత్త హువేయి ఫోన్లలో, రెండవ సిమ్ లేదా నానో మైక్రో కార్డు ఉపయోగించుకోవచ్చు.                             

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo